Breaking News

స్పందనలో వచ్చిన ప్రజా సమస్యలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలి.

-నేడు స్పందనలో వచ్చిన అర్జీలు.131
-ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుండా అధికారులు పరిష్కరించాలి.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో వచ్చిన అర్జీలను అధికారులు విచారించి నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహులు తో కలిసి కలెక్టర్ మాధవీలత వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీ లత మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం స్పందనలో వినతులు అందించిన ప్రజల సమస్యలను నిర్ణిత కాలవ్యవధిలోనే పరిష్కరించే విధంగా తగు చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. శాఖపరమైన అధికారులు వారి పరిధిలో ఉన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించి, వారి పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖ అధికారులు పంపించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈరోజు స్పందనలో 131 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించామన్నారు. ఇందులో ఆన్లైన్లో 116, ఆఫ్ లైన్ లో 15 అర్జీలు ఉన్నాయని తెలిపారు. సమస్యలు పరిష్కారంకొరకు ఏ ఒక్క అర్జీ దారుడిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దన్నారు. కలెక్టర్ అన్నారు. స్పందనలో నమోదైన ప్రతి అర్జీని పరిష్కరించాలని ఆయన సూచించారు. జగనన్నకు చెబుదాం పోర్టల్ లో వచ్చిన ఆర్జీలను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా పునరావృతమయ్యే అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్పందనలో వచ్చిన కొన్ని అర్జీలు.:- నల్లజర్ల మండలం చీపురు గూడెం గ్రామానికి చెందిన జాలపర్తి అప్పారావు తమ అర్జీలో చీపురుగూడెంలో 5.17 ఎకరాల భూమి ఉందని, అయితే స్థానికులు కొందరు నా భూమికి తూర్పు వైపునున్న 40 సెంట్లు మట్టి పోసి ఇబ్బంది పెడుతున్నారని తన న్యాయం చేయాలని వారు అర్జీలో పేర్కొన్నారు. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన గన్నిన సత్యనారాయణ తమ అర్జీలో గజ్జరం గ్రామంలో 32/1 లో 1.60 ఎకరాలు 32/3 లో 53 సెంట్లు భూమి ఉందని నా భూమి హద్దులు నిర్ణయిస్తూ సర్వే చేయించాలని అందుకు అయ్యే తగు రుసుమును చెల్లించ గలవాడినని అర్జీలో పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్ ఏజ్ భరత్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 24 తేదీ నుంచి నియోజకవర్గాల స్థాయిలో క్రీడలు ప్రారంభించేందుకు సంబంధిత అధికారులను తగు చర్యలు ఆదేశించారు . క్రీడలనియోజకవర్గస్థాయి ఇంచార్జి అధికారులు కార్యాచరణ ప్రణాళికతో పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డీఆర్వో జి.నరశింహులు, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి.స్వామి నాయుడు, డియంహెచ్ఓ డా.కె.వేంకటేశ్వర రావు, డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి, సీపీఓ ఎల్. అప్పల కొండ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె. విజయ కుమారి,డి ఈఓ ఎస్. అబ్రహం, డి ఎల్ డిఓ పి. వీణాదేవి, సివిల్ సప్లై జిల్లామేనేజరు వి.నాగార్జున రెడ్డి, ఎస్ ఈ పి ఆర్ ఎ బి వి ప్రసాద్, ఎస్ ఈ ఆర్ డబ్ల్యు ఎస్ డి. బాల శంకరరావు, డి ఎల్ డివో వి. శాంతమణి పలువురు జిల్లా శాఖా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *