Breaking News

జిల్లాలో తుది ఓటరు జాబితా మేరకు 16,05,762

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2024 కార్యక్రమం లో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనల ననుసరించి తూర్పు గోదావరి జిల్లాలో 16,05,762 మంది ఓటర్లను గుర్తించామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో ఎస్ ఎస్ ఆర్ 2024 తుది ఓటర్ల జాబితా ను విలేఖరుల సమావేశంలో ప్రకటించారు . కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియ చేస్తూ… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2024 కు జనవరి, 12 వతేదీ వరకు ఎన్నికల సంఘం గడువు పొడిగించిన సందర్భంగా ఆ తేదీ నాటికీ అందిన మొత్తం దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించి , జనవరి, 22 వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత పేర్కొన్నారు. గత ఓటర్ల జాబితా సవరణ అనంతరం జిల్లాలో 16,05,762 మంది ఓటర్ల జాబితాలో నమోదయ్యారు. గత ఓటర్ల ఎస్ ఎస్ ఆర్ 23 జాబితా (5.1.23.నుండి ప్రస్తుత ఓటర్ల ఎస్ ఎస్ ఆర్ 24 జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (12.1.24) ద్వారా అదనంగా 53,494 మంది ఓటర్లుగా నమోదయ్యారు. జిల్లాలో మొత్తం 16,05,752 మంది ఓటర్లు కాగా, 7,85,142 మంది పురుష ఓటర్లు, 8,20,515 మంది మహిళా ఓటర్లు, 105 మంది ట్రాన్సజెండర్స్ ఓట్లు ఉన్నాయన్నారు. ఓటర్ల జాబితా సవరణ కు సంబంధించి వివిధ రాజీకీయాల పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయా లను, సూచనలను తీసుకోవడం జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లాలో ఇంతవరకు గత మూడు నెలలుగా ప్రతి బుధవారం సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు గాను 1569 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతీ పోలింగ్ బూత్ లోను తాగునీరు, విద్యుత్, విభిన్న ప్రతిభావంతులకు ర్యాంపులు, టాయిలెట్ లు, ఫర్నిచర్, తదితర కనీస ప్రాధమిక మౌలిక సదుపాయాలు కల్పించాం. నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా. : 1) రాజమండ్రి అర్బన్ శాసనసభ 260360 నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు కాగా, 125639 మంది పురుష ఓటర్లు, 134663 మంది మహిళా ఓటర్లు, 58 మంది ట్రాన్సజెండర్లు ఓటర్లుగా ఉన్నారు. 2) రాజమండ్రి రూరల్ శాసనసభ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 271159 కాగా, 132531 మంది పురుష ఓటర్లు, 138604 మంది మహిళా ఓటర్లు, 24 మంది ట్రాన్సజెండర్లు ఓటర్లుగా ఉన్నారు. 3) రాజానగరం శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 213911 ఓటర్లు కాగా, 105824 మంది పురుష ఓటర్లు, 108083 మంది మహిళా ఓటర్లు, 4 మంది ట్రాన్సజెండర్లు ఓటర్లుగా ఉన్నారు. 4) అనపర్తి శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 223255 ఓటర్లు కాగా, 109323 మంది పురుష ఓటర్లు, 113930 మంది మహిళా ఓటర్లు, 2 మంది ట్రాన్సజెండర్లు ఓటర్లుగా ఉన్నారు. 5) నిడదవోలు శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 211874 ఓటర్లు కాగా, 103600 మంది పురుష ఓటర్లు, 108269 మంది మహిళా ఓటర్లు, 5 మంది ట్రాన్సజెండర్లు ఓటర్లుగా ఉన్నారు. 6) కొవ్వూరు శాసనసభ నియోజకవర్గంలో మొత్తం 183405 ఓటర్లు కాగా, 89442 మంది పురుష ఓటర్లు, 93958 మంది మహిళా ఓటర్లు, 5 మంది ట్రాన్సజెండర్లు ఓటర్లుగా ఉన్నారు. 7) గోపాలపురం శాసనసభ నియోజక వర్గంలో మొత్తం 241798 ఓటర్లు కాగా, 118783 మంది పురుష ఓటర్లు, 123008 మంది మహిళా ఓటర్లు, 7 మంది ట్రాన్సజెండర్లు ఓటర్లుగా ఉన్నారు. ఈవిఎం, సి యూ, వివి ప్యాట్ లపై అవగాహన కోసం మోడల్ పోలింగ్ కేంద్రాల నమూనా ఈ వి ఎం లను ఏర్పాటు చేశాం.   ఈనెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు ప్రాముఖ్యత, ఓటు హక్కు వినియోగం పై పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు వ్యాసరచన, వ్రక్తుత్త్వ పోటీలు నిర్వహించడం జరిగింది.  ఓటు హక్కు వినియోగం, ఓటు నమోదుపై ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయడం  ద్వారా ప్రజలకు అవగాహన కలిగించాం. జిల్లాలో వివిధ కూడళ్లలో నమూనా ఈ వి ఎం ల ఫ్లెక్సీ ప్రదర్శన  ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జి. నరసింహులు, కే ఆర్ ఎస్ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ కృష్ణ నాయక్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *