Breaking News

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

-ఓటరు నమోదు ప్రక్రియ నిరంతర ప్రక్రియ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్ ఎస్ ఆర్ కి సంబంధించి గత మూడు నెలలుగా రాజకీయ పార్టీలు తో సమావేశం నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లో రాజకీయ పార్టీలతో కలెక్టర్ మాధవీలత, జేసీ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జి. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ నాయక్, రాజకీయ పార్టీలు ప్రతినిధులు మాజీ మంత్రి, టిడిపి ప్రతినిధి కె యస్. జవహర్ రెడ్డి, బిజెపి పివి లక్ష్మి, అప్ ప్రతినిధి వై. శ్రీనివాస రావు, వై. వర ప్రసాద్, సిపిఐ – ఎం, ఎస్ ఎస్ మూర్తి , వైయస్ఆర్ సీపీ ప్రతినిధి యూ పి వర్మ , కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పొలిటికల్ పార్టీలు తప్పకుండా వారి ప్రతినిధి ఎన్నికల కోసం నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు పారదర్శకంతో కూడిన ఓటరు జాబితా కోసం నిరంతర ప్రక్రియ గా ఓటరు జాబితా రూపు కల్పన చెయ్యడం జరిగిందన్నారు. ఇందు కోసం అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం, అందుకు అనుగుణంగా సదరు రాజకీయ పార్టీల సలహాలు సూచనలు పరిగణన లోకి తీసుకుని వెళ్ళడం జరిగిందన్నారు. జిల్లాలో ఏడు దరఖాస్తులు ఇంకా పరిష్కారం చెయ్యాల్సి ఉంది, అవి సాంకేతిక కారణాలు వలన పెండింగు లో ఉన్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు ఎస్ ఎస్ ఆర్ 2024 ఫోటో తో కూడిన ఓటరు తుది జాబితా హార్డ్ కాపీ ఇవ్వడం తో పాటు ఏడు నియోజక వర్గాల కు చెందిన సాఫ్టు కాపి సి డి ని కూడా ఇవ్వడం జరుగుతున్నట్లు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు,, అభ్యంతరాలు తీసుకుని వాటిని పరిష్కారం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పోలింగ్ శాతం పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నా మన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యత,  వినియోగం పై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసాం. ముఖ్యంగా  1. 1. 2024 వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసేందుకు  కళాశాల స్థాయిలో పెద్దఎత్తున  అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈవిఎం, సి యూ, వివి ప్యాట్ లపై అవగాహన కోసం మోడల్ పోలింగ్ కేంద్రాల నమూనా ఈ వి ఎం లను ఏర్పాటు చేశాం.   ఈనెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటు ప్రాముఖ్యత, ఓటు హక్కు వినియోగం పై పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు వ్యాసరచన, వ్రక్తుత్త్వ పోటీలు నిర్వహించడం జరిగింది.  ఓటు హక్కు వినియోగం, ఓటు నమోదుపై ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయడం  ద్వారా ప్రజలకు అవగాహన కలిగించాం. జిల్లాలో వివిధ కూడళ్లలో నమూనా ఈ వి ఎం ల ఫ్లెక్సీ ప్రదర్శన  ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *