Breaking News

ఫిబ్రవరి 19 వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు

– ప్రజలు రహదారి భద్రత కోసం సామాజిక బాధ్యత వహించాలి
– కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రహదారి భద్రతని పాటించడం మనందరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పిలుపు నిచ్చారు. సోమవారం ఉదయం  జిల్లా కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో 35 వ రహదారి భద్రతా మాసోత్సవాలకు సందర్భంగా పోస్టర్లను, కరపత్రాలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, జిల్లా రవాణా అధికారి కె వి కృష్ణా రావు తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీలత మాట్లాడుతూ,  జిల్లాలో రహదారి భద్రతా మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాలకు భాగంగా జనవరి 20వ తేది నుంచి ఫిబ్రవరి 19వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరు అంశాలను దృష్టిలో పెట్టుకొని వాహన చోదకులు వాహనాలు నడిపే సందర్భంలో జాగ్రత్త పడాలన్నారు. వాహనదారులు మితిమీరిన వేగంతో ప్రయాణించ రాదు,  ద్విచక్ర వాహనాలు నడిపేటపపుడు హెల్మెట్ ధరించాలి , కారు నడిపే సమయంలో సీట్ బెల్ట్, బైక్ పై త్రి బుల్ రైడ్, అంతకు మించి మోటార్ సైకిల్ పై ప్రయాణించారాదు, వాహనం నడిపే సమయంలో ఫోన్ ఉపయోగించకూడదన్నారు. సిగ్నల్స్ ను అనుసరించి నియమ నిబంధనలు పాటించాలని , పాదచారులకు రోడ్డున దాటే అవకాశం కల్పించేలా వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. రవాణా, ఇతర అధికారులు సమన్వయం సాధించడం ద్వారా ప్రజల్లో విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. జిల్లా రవాణా అధికారి కే వి కృష్ణా రావు మాట్లాడుతూ , వాహనం నడిపే సందర్భంలో ఖచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని, అదే సమయంలో రవాణా శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలు అత్రిక్రమిస్తే అపరాధ రుసుం విధించడం జరుగుతుంది అని పేర్కొన్నారు. రహదారి భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకొని వాహనాలు నడిపితే ప్రమాదాలు నివారించడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జి. నరసింహులు, డి టి ఓ కేవి కృష్ణ రావు, స్పెషల్ డి సి/ పర్యాటక శాఖ ఆర్ డి వి. స్వామి నాయుడు, మోటర్ వేహికల్ ఇన్స్పెక్టర్ లు  సిహెచ్. సంపత్ కుమార్, బి ఎస్ ఎస్ నాయక్ , జీ. రామ్ నారాయణ్, సహాయ మోటర్ వేహికల్ ఇన్స్పెక్టర్ లు  సబిత, రాధిక, జమీర్,  ఇతర రవాణా శాఖ అధికారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *