Breaking News

ప్రజల సమస్యలకు పరిష్కారం స్పందన

-స్పందన కార్యక్రమంలో అందినఫి 22 ఫిర్యాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధమ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లోవిజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందన కార్యక్రమంలో 22 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ పరిధిలోని సమస్యలను అర్జీ రూపంలో సమర్పించగా సంబంధిత అధికారులు ఆ సమస్యకు సత్వర పరిష్కారం అందించాలని కమీషనర్ ఆదేశాలు ఇచ్చారు. సోమవారం ఉదయం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా ఇంజనీరింగ్ విభాగానికి 5, టౌన్ ప్లానింగ్ 12, రెవిన్యూ 2, హెల్త్ -1, ఎస్టేట్ 2, మొత్తం కలిపి 22 అర్జీలు, ప్రజలు నుండి అధికారులు దరఖాస్తు స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం ప్రభాకర్ రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ రత్నావళి, సిటీ ప్లానర్ జీవి జీ ఎస్ వి ప్రసాద్, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) వెంకటలక్ష్మి, ఏ డి హెచ్ శ్రీనివాస్, అకౌంట్స్ ఆఫీసర్ నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *