మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరు ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకుని ఓటు వేసేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, తద్వారా వచ్చే ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంపునకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. ఫోటో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఫోటో ఓటర్ల తుది జాబితా వారికి అంద జేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫోటో ఓటర్ల తుది జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 15, 18,255 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. వీరిలో పురుష ఓటర్లు 7,37,394 కాగా మహిళా ఓటర్లు 7,80,796 అన్నారు. నియోజకవర్గాల వారీగా 2,86,679 మంది ఓటర్లతో పెనమలూరు మొదటి స్థానంలో, 2,77,323 మంది ఓటర్లతో గన్నవరం రెండవ స్థానంలో, 2,10,965 మంది వాటర్లతో అవనిగడ్డ నియోజకవర్గ మూడో స్థానంలో నిలిచాయి అన్నారు. ఈనెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం నాడు ఓటర్లను చైతన్యవంతం చేయుటకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమాలలో విద్యార్థులను సీనియర్ సిటిజన్స్, ఇది వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా గతంలో కంటే పోలింగ్ శాతం పెంపునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వివిధ రాజకీయ పక్షాలు ఈ కార్యక్రమాలకు సహకరించాలని సూచించారు. గత ఎన్నికల్లో తక్కువగా పోలైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి అట్టి ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంపునకు దృష్టి పెడతామని, పోలింగ్ కేంద్రాల మధ్య పోటీ తత్వంతో 90 శాతం పైగా పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. బి ఎల్ ఓ లను ఇంటింటికి పంపి ఓటర్లను కలిసి వారి ఓటు ఎక్కడ ఉన్నదో ముందుగా తెలియజేసే విధంగా పోలింగ్ పెరిగేలా చూస్తామన్నారు. వ్యాపార సంస్థలలో పని చేసే వారందరూ కూడా ఓటింగ్లో పాల్గొనేలా వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించగా ఆ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పెద్ది రోజా, వైసిపి, టిడిపి, ఐ ఎన్ సి, బిజెపి, సిపిఎం, బి ఎస్ పి పార్టీల ప్రతినిధులు షేక్ సిలార్ దాదా, దిలీప్, చంద్రశేఖర్ పంతం గజేంద్ర, కొడాలి శర్మ, ఎస్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News