విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మాలలను ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు అని మాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయ సమావేశంలో మాలల జేఏసీ నాయకులు మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా మాలలకు ఆయా రిజర్వుడు నియోజకవర్గాలలో సముచిత స్థానం కల్పించాలని కోరారు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో టిడిపి మాదిగలకు సీట్లు కేటాయించడం జరిగింది. మనలకు ఒక నియోజకవర్గంలో కూడా కేటాయించకపోవడం దారుణం అన్నారు.. ఇదే ఇదే బాటలో వైయస్సార్ సిపి పార్టీ కూడా నడుస్తుందని మాల వ్యతిరేక పార్టీలైన అన్ని పార్టీలకు 2024 ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. ఇప్పటికైనా ఆయా రాజకీయ పార్టీలు పునరాలోచించి మాలలకు తగిన టికెట్లు కేటాయించాలని మాల జాతిని ఏ పార్టీ గుర్తిస్తుందో ఆ పార్టీకే రానున్న ఎన్నికలలో పనిచేయనున్నట్లు మాల జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరో 15 రోజుల్లో రాష్ట్ర స్థాయి మాలల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు.
భారీ బహిరంగ సభ ద్వారా మా నిర్ణయం ఆ రోజే తెలియజేస్తామని మాలల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. అలాగే రానున్న ఫిబ్రవరి నెల నుండి రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాలలో మాలలను కలుస్తూ 2024 ఎన్నికలకు సంయుక్తం చేస్తామని జేఏసీ నాయకులు తెలిపారు రాజకీయ పార్టీలు ఎప్పటికైనా కళ్ళు తెరిచే మనలకు సముచిత స్థానం కల్పించని పక్షంలో 175 నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టి మా ఓటు మనకోసం అనే నినాదంతో వేలుటకు కూడా వెనకడుగు వేయబమని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ మాల నాయకులు. జై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోగులమూడి రాము, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు వీరబత్తిన అమల దాసు, మాల మహానాడు అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు సేవ నాగ జగన్ బాబురావు, జై మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గోవాడ సునీల్, జై మాల మహానాడు కార్యవర్గ సభ్యులు బాపట్ల కిరణ్ కుమార్, రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షురాలు చుక్క రాణి, జై భీమ్ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దియ్యాల జ్యోతి మేరీ, మాల మహానాడు రాష్ట్ర విద్యార్థి విభాగ అధ్యక్షులు జక్కుల విజయ్ కుమార్, మాల మహానాడు యూత్ విభాగ అధ్యక్షులు జల్ది శివకుమార్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News