విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయింపులో మాలల కు సముచిత స్థానం కల్పించాలని జై మాల మహానాడు అధ్యక్షులు గోగులమూడి రాము కోరారు. కొన్ని ప్రాంతాల్లో మాలలకు పూర్తి స్థాయి లో అన్యాయం జరుగుతుందని తమ దృష్టి కి వచ్చిందని తెలిపారు. అదే నిజమైతే ఆయా పార్టీలు రానున్న రోజులలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ లు ఎన్ని ఉన్న ఏ ప్రాంతమైన మాలల కు న్యాయం చేయాలనీ గోగులమూడి రాము కోరారు.
Prajavartha Online Telugu News