Breaking News

అర్హులైన భూమిలేని నిరుపేదలకు అసైన్మెంట్ పట్టాలు మంజూరు చేయుటకు చర్యలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన భూమిలేని నిరుపేదలకు అసైన్మెంట్ పట్టాలు మంజూరు చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ వారి ఛాంబర్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఏడాది మే 22 తేదీన మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ పనులు ప్రారంభోత్సవానికి మచిలీపట్నం వచ్చిన సందర్భంగా ఇచ్చిన ఆదేశాల మేరకు, మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు వారి కోరిక మేరకు మచిలీపట్నం మండల పరిధిలో మొత్తం 11 గ్రామాలలో (పోలాటి తిప్ప, కొత్తపల్లి తుమ్మలపాలెం, తాళ్లపాలెం, కానూరు, పెదపట్నం, పల్లె తుమ్మలపాలెం, కోన, రుద్రవరం, గుండు పాలెం, చిన్నాపురం, వాడపాలెం) 12,311 .21 ఎకరాల భూమిని ప్రాథమికంగా గుర్తించి, ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించవలసిందిగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎంజాయ్ మెంట్ సర్వే పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎంజాయ్ మెంట్ సర్వే పూర్తయిన తర్వాత మొత్తం 12,311 .21 ఎకరాల్లో 2193 .74 ఎకరాలు 1570 మంది ఒరిజినల్ ఎస్సైన్దారులు లేదా వారి వారసుల స్వాధీనంలో ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని, 9,729 .92 ఎకరాలు ఇతరుల స్వాధీనంలో ఉండి సాగు చేసుకున్నట్లుగా గుర్తించినట్లు, మరియు 387 .55 ఎకరాలు అసైన్మెంట్ చేయుటకు వీలుపడని భూమిగా గుర్తించినట్లు తెలిపారు. ఏపీ ఎస్సైన్మెంట్ ల్యాండ్స్ చట్టం 1977 అనుసరించి ఇతరుల స్వాధీనంలో గల భూములకు, ఒరిజినల్ ఎస్సైని దారులకు, ప్రస్తుతం అనుభవంలో ఉన్నవారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. నోటీసులు అందిన 15 రోజుల లోపు వారి రాతపూర్వక సంజాయిషీ/ అభ్యంతరాలు మచిలీపట్నం తాసిల్దార్ వారికి సమర్పించవలసి ఉంటుందన్నారు. ఈ విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత గ్రామ వీఆర్వో లేదా మచిలీపట్నం తాసిల్దార్ లేదా ఆర్డీవో గారిని సంప్రదించవచ్చునని తెలిపారు. నిర్ణీత గడువు ముగిసిన తదుపరి మచిలీపట్నం తాసిల్దార్ ఒరిజినల్ అసైన్మెంట్ దారుల స్వాధీనంలో లేని ప్రభుత్వ భూములను ప్రభుత్వమునకు స్వాధీనపరచెదరని, అర్హులైన భూమిలేని నిరుపేదలకు అసైన్మెంట్ పట్టాలు మంజూరు చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *