రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి భూముల రిజిస్ట్రేషన్, రీ సర్వే, ఇనాం అసైన్ ల్యాండ్, స్త్రీ శిశు సంక్షేమ , వైద్య ఆరోగ్య, పంచాయతి రాజ్ అంశాలపై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కే . మాధవీలత ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత జిల్లా ప్రగతిపై సమగ్ర నివేదికను వివరిస్తూ, రిజిస్ట్రేషన్ కోసం జిల్లాలో 57918 ప్లాట్స్ మ్యాపింగ్ పూర్తి చేశామన్నారు. సుమారు 55 వేల ప్లాట్స్ కు సరిహద్దులు గుర్తించినట్లు తెలిపారు. వాటిలో 54 వేల ప్లాట్స్ రిజిస్ట్రేషన్ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం అయినట్లు తెలిపారు. రీ సర్వే కి సంబంధించి మిగిలిన 41 గ్రామాలు ఫైనల్ ఆర్ వో ఆర్ పెండింగ్ లో ఉన్నట్లు వాటికి సంబంధించి క్షేత్ర స్థాయిలో పనులు పూర్తి చేశామని, క్లారికల్ పనులు కూడా పూర్తి చేసినట్లు, సంబంధిత నివేదికలు సైన్ చేసిన సమర్పిస్తామని పేర్కొన్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ సమీక్ష లో జిల్లాలో 1556 కేంద్రాలలో పనుచేయుచున్న 1538 కి గాను 10 సెలవులో ఉన్నారని, మిగిలిన 1528 అంగన్వాడీ కార్యకర్తలు , 1495 అంగన్వాడీ ఆయాలు నూరుశాతం విధులకు హాజరైనట్లు వివరించారు. జిల్లా లోని అన్ని 1556 కేంద్రాలకు ఆహారం సరఫరా చేశామని, టిహెచ్ఆర్ 16,390 మంది పిల్లలకు సంపూర్ణ పోషక ఆహారం అందచేశామని అన్నారు. ఉపాధిహామీ కి సంబంధించి 48 లక్షల పనిదినాలకి గాను 44.52 లక్షల పని దినాలు లక్ష్యం సాధించినట్లు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2 వ విడత లో భాగంగా 46,766 మందికి వైద్య సేవలు అందించినట్లు కలక్టర్ మాధవీలత తెలిపారు. వీరిలో 192 మందికి తదుపరి వైద్య సేవలు కొసం రిఫరల్ ఆసుపత్రులకు సిఫార్సు చెయ్యగా వారిలో 88 మంది ఆసుపత్రులకు వెళ్ళి చికిత్స చేసుకున్నారని, మిగిలిన వారికి కూడా అవగాహన కల్పిస్తున్నట్లు తెలియ చేశారు. వాటికి సంబంధించి కేసు స్టడీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. డి వార్మింగ్ డే సందర్భంగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, ఫిబ్రవరి 9 న జిల్లా స్థాయి లో పంపిణీ చెయ్యాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. మండల పరిధిలో ఫిబ్రవరి 7 న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కి చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. జిల్లాలో 10 వ తరగతి పరీక్షలకు 137 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు, 23,681 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో బాలురు 12,112, బాలికలు 11,569 మంది ఉన్నారని కలక్టర్ మాధవీ లత తెలియ చేశారు. వీరిలో ఆంగ్ల మాధ్యమం లో 17,267 మంది, తెలుగు మాధ్యమంలో 6,414 మంది హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది 72 శాతం ఉత్తీర్ణత సాధించారని, ఈ ఏడాది నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకుజిల్లాలో 52 పరీక్షా కేంద్రాల ద్వారా 41,304 మంది హజరు కానుండగా వారిలో మొదటి ఏడాది 21,288 మంది, 2 వ ఏడాది 20,016 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఇంటర్మీడియేట్ కి 37,502 మంది, వొకేషనల్ కోర్సు విద్యార్థులు 3,802 మంది ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, సిపివో ఎల్. అప్పల కొండ, డ్వామా పిడి ఏ . ముఖ లింగం, వైద్యాధికారులు డా కె. వేంకటేశ్వర రావు, డా సూర్య ప్రభ, డా ఎన్. సనత్ కుమారి, డా పి. ప్రియాంక, డిపివో జే . వి. సత్యనారాయణ, ఆర్ డబ్ల్యు ఎస్ డి. బాల శంకరరావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కే. తదితరులు పాల్గొన్నారు
Tags Rājamahēndravaraṁ
Check Also
చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …
Prajavartha Online Telugu News