– ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకుని విద్యార్థులు భావి శాస్త్రవేత్తలు గా ఎదగాలి
-రాతి యుగం లో రాళ్ళ మధ్య రాపిడితో అగ్గి పుట్టించే నాటి నుండి చంద్రమండలం పై మన శాస్త్ర వేత్తల విజ్ఞానం అభివృద్ధి
-ఇస్పైర్ విజ్ఞాన ప్రదర్శన ప్రతి ఒక్కరికీ స్పూర్తిగా నిలవాలి.
-ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన
– యంపీ. భరత్ రామ్
– జెసి తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకుని వారీ లోని సృజనాత్మక జోడించి విద్యార్థులు భావి శాస్త్రవేత్తలు గా ఎదగాలని పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ , జేసీ తేజ్ భరత్ లు అన్నారు. గురువారం స్థానిక సి.జి.టి.ఎం. ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల లలితానగర్ లో నిర్వహించిన డిఎల్ఈపీసీ 2022-23 జిల్లాస్థాయి ప్రదర్శన మరియు ప్రాజెక్టుల పోటీలు, జిల్లా ఇన్స్పైర్ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన ను (INSPIRE MANAK AWARDS) కార్యక్రమాన్నిఎంపీ మార్గాని భరత్ రామ్, రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ చైర్ పర్సన్ మేడపాటి షర్మిళారెడ్డి, జాయింట్ కలెక్టరు తేజ్ భరత్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి “ఇన్స్పిరేషన్ మనక్” విజ్ఞాన ప్రదర్శనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా యంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞాన రంగం లో భారత్ ఎన్నో విజయాలు సాధిస్తూ.. ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇస్తోందన్నారు . నేడు పాఠశాల స్థాయి లో తయారు చేసిన ఆవిష్కరణలు భవిష్యత్ లో ఎందరికో స్ఫూర్తి నిచ్చే విధం గా ఉండాలన్నారు. విద్య మాత్రమే మనకున్న ఆస్తి అని దానిని ఎవరు దొంగలించ లేరని ప్రతి విద్యార్థి లక్ష్యసాధన పట్ల పట్టుదల కృషితో సాధన చేస్తే వాటింతట అవే మన ధరిచేరతాన్నారు. భవిష్యత్తులో ఏమి చేయదలచుకున్నామో విద్యార్థులు విద్యాభ్యాసం నుంచి ప్రణాళికలు రూపొందించుకుని లక్ష్యాలను నిర్థేశించుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారని ఆదిశగా విద్యార్థులు ఉన్నత ఆశయాలతో రాణించాలని సూచించారు. విద్యా శాఖను అభినందిస్తూ విద్యార్థులు వారు ఆసక్తి చూపుతున్న అంశాలపై స్పూర్తి నిచ్చే విధంగా అధ్యాపకులు తొడ్పాటు నిచ్చే విధంగా కృషిచేయాలని సూచించారు. మన దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసే విధంగా ఇస్రో చంద్రునిపై వెళ్లడం మనందరికి గర్వకారణం అన్నారు. రేపు ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారతదేశం ఎదగాలంటే ప్రతి విద్యార్థి నెంబరు ఒన్ స్థాయికి వెళ్లి దేశానికే ఆదర్శంగా నిలుస్తూ మన దేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందే విధంగా విద్యార్థుల్లో స్పూర్తిని నింపాలన్నారు . అధ్యాపకులు ఆదిశగా కృషి చేయాలని సూచించారు. ఈ రోజు మన రాజమహేద్రవరం హైదరాబాదుకు దీటుగా పార్కులు అభివృద్ధి చేశామన్నారు..కంబాల చెరువులు అత్యంత సాంకేతికతతో కూడిన విధంగా రూపొందించు కున్నామని పేర్కొన్నారు. తమ హయాంలో నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, ఎక్కడా లేని విధం గా ఓపెన్ ఎయిర్ అంఫి థియేటర్ ను నిర్మించామన్నారు. నగరం లో పచ్చదనానికి పెద్ద పీట వేస్తూన్నా మన్నారు. రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ చైర్ పర్సన్ మెడపాటి షర్మిళా రెడ్డి మాట్లాడుతూ మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదని మనం విద్యా పరంగా నూరు శాతం కృషి పట్టుదలతో పనిచేస్తామో లక్ష్య సాధన సులభ మౌతుందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ మాట్లాడుతూ రాతి యుగం లో రాళ్ళ మధ్య రాపిడితో అగ్గి పుట్టించే నాటి నుండి చంద్రమండలం పై మన భారత శాస్త్ర వేత్తలు రోవర్ ని ల్యాండ్ చేసే స్థాయికి శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిందన్నారు. పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి ని పెంచుకోవాలన్నారు. ప్రతి విద్యార్థికి మనం అన్ని సౌకర్యాలతో కూడిన విద్య ను అందిస్తే సాంకేతికంగా విద్యార్థులు అద్బుతాలు సృష్టిస్తారన్నారు.విజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానం మేళవించి వారీ ప్రతిభను మెరుగు పరుచుకోవడానికి కృషి చేస్తారో వాళ్ళు ఉన్నత స్థాయి కి చేరుకొగలుతారనీ తేజ్ భరత్ తెలిపారు. వివిధ స్కూల్స్ విద్యార్దులు రూపొందించి ఉత్తమ అంశాలను ప్రదర్శన చేసినట్లు, వీటిని చూసి మరింత మంది స్ఫూర్తి పొందడం సాధ్యం అవుతుందన్నారు.. ప్రతీ ఒక్క విద్యార్థిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మేడపాటి షర్మిలా రెడ్డి, డి సి సి బి చైర్మన్ ఆకుల వీర్రాజు, ఏ.పి స్టేట్ హజ్ కమిటీ సభ్యులు మహ్మద్ ఇబాదుల్లా, స్టేట్ మైనారిటీస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ షేక్ నిజాముద్దీన్,ఇన్స్పైర్ మనక్ జాతీయ స్థాయి పరిశీలకులు బెనర్జీ, జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె.వాసుదేవరావు, రాజమహేంద్రవరం డివిజన్ ఉప విద్యా శాఖాధికారి ఈ వి బి ఎస్ నారాయణ,అర్బన్ రేంజ్ డి ఐ.బి. దిలీప్ కుమార్, రూరల్ ఎమ్ ఈ ఓ ఏ.దుర్గా తులసీ దాస్,సి జి టి ఎమ్ పాఠశాల అధ్యక్షులు ఆర్.సత్యనారాయణ మూర్తి, ఉపాధ్యక్షులు లయన్ కె.సాయి కుమార్, సెక్రెటరీ చింతల కృష్ణాజీ, కమిటీ సభ్యులు ఏ.ఎస్.ఆర్.ప్రభు, పాఠశాల ప్రధానోపాధ్యాయిని లిడియా గ్రేస్, ఇన్స్పైర్ కమిటీ సభ్యులు కోలా సత్యనారాయణ, రమణ రావు, గణపతి, మంగిన రామారావు ,పి ఈ.టి లు విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News