-400 కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు ప్రయోజనం
– నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో. జి.. సుధాకర్
– ఉద్యనవన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో. బి. శ్రీనివాసులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అకడమిక్ విద్యా సంవత్సరంతో పాటు విద్యార్థులకి నైపుణ్యం కలుగ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ” ఎడెక్స్ ” తో ఒప్పందం చేసుకోవడం జరిగిందనీ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో. జి.. సుధాకర్ , డా వైయస్ఆర్ ఉద్యానవన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రో. బి. శ్రీనివాసులు పేర్కోన్నారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ. వైయస్ జగన్ మోహన్ రెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో వీడియో కాన్ఫరెన్స్లో “edX కోర్సులు” ప్రారంభించడం జరిగింది. స్ధానిక కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి నన్నయ్య , ఉద్యాన వన యూనివర్సిటీస్ రిజిస్ట్రార్ లు, డీన్స్, ప్రొఫెసర్స్, విద్యార్దులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా ప్రో . జి. సుధాకర్ , ప్రో. బి. శ్రీనివాసులు వివరాలు తెలియ చేస్తూ, యువత కు విద్యా తో పాటు వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందించే క్రమంలో నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. వివిధ డిగ్రీ కోర్స్ లు పూర్తి చేసుకుంటున్న విద్యార్థులకి ఉన్నత ప్రమాణాలతో కూడిన మరింతగా ఉన్నత స్థాయి నైపుణ్యం కలుగ చేసేందుకు అడుగులు వేయడం జరుగుతోందన్నారు. ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ” ఎడెక్స్ ” అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సంస్ధ తో ఒప్పందం కుదిరిందనీ, ఇందు వల్ల మా పరిదిలో ఉన్న 400 పైగా విద్యా సంస్థలలో డిగ్రీ కళాశాలలో చివరి ఏడాది చదువుకుంటున్న సుమారు 50 వేల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నత భవిష్యత్తు కోసం అంతర్జాతీయ స్థాయి లో మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. విదేశాలకు వెళ్లి అక్కడి మేటి కాలేజీల్లో చదువుకోలేని ఎంతో మంది విద్యార్థులు హార్వర్డ్, ఎంఐటీ, కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, న్యూయార్క్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు రూపొందించిన కోర్సులను సులభంగా నేర్చుకునే వెసులుబాటు ప్రముఖ ఆన్ లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’ (edX )తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం ద్వారా .. ఆ యూనివర్సిటీ వారే ఆ సబ్జెక్టులకు ఆన్ లైన్ లో ఎగ్జామ్స్ నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారనీ వారు పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో నన్నయ్య యూనివర్సిటీ డీన్ ప్రో.. పి. సురేష్ వర్మ , ప్రిన్సిపల్ ప్రో. డీ. జ్యోతిర్మయి , ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ పి. వేంకటేశ్వర రావు, స్టూడెంట్స్ అఫ్ఫైర్స్ డీన్ ప్రో.. సలోమి సునీత , డీన్ ప్రో.. ఉదయ భాస్కర్, ప్లేస్మెంట్ అధికారి ప్రో. బి జె ఏం రెడ్డి, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News