-అర్హత కలిగిన ఓటరు ఓటు హక్కు వేసేలా చైతన్యం తీసుకుని రావాలి
-యువ ఓటర్ల నమోదు పై మరింత దృష్టి పెట్టాలి
-ఓటు హక్కు కలిగి వున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఓటు హక్కు కలిగి వున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ఓటరుగా నమోదు కావలసిన ఉన్న వారినీ గుర్తించి ఓటు హక్కును పొందేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడం కోసం నిర్దుష్ట ప్రణాళిక లు సిద్దం చేయాలనీ కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో స్వీప్ నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కె. మాధవీలత మాట్లాడుతూ, స్వీప్ (sveep) క్రమబద్ధమైన ఓటర్ల లో చైతన్యం మరియు ఎన్నికల్లో భాగస్వామ్య లక్ష్యంగా కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనీ ఆదేశించారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఓటర్ల వద్దకు చేరాల్సి ఉంటుందన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యత , రాజ్యాంగం కల్పించిన హక్కు వలన తప్పకుండా పోలింగ్ రోజున ఓటు హక్కు వేసేలా చైతన్యం తీసుకుని రావడం చాలా ముఖ్యం అన్నారు. ఓటరు యొక్క అక్షరాస్యతను ప్రోత్సహించడం కోసం భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కార్యక్రమం అని పేర్కొన్నారు. ఆమేరకు తూర్పు గోదావరి జిల్లా లో ఓటింగ్ శాతం పెరిగేలా ప్రతీ ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. అర్హత కలిగిన పౌరులను ఓటర్లుగా నమోదు చేయడంలో ఉన్న అంతరాలను అధిగమించడం కోసం నిర్దుష్ట ప్రణాళిక తప్పనిసరి అన్నారు. స్వీప్ కార్యకలాపాల గురించి టైమ్ లైన్స్ నిర్దేశించుకుని, సమన్వయం చేసుకొవాలని మాధవీలత స్పష్టం చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఓటరు నమోదు నుంచీ పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్ల లో అవగాహన కల్పించడం కోసం చక్కటి ప్రచార కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ప్రచార కార్యక్రమాలలో వినూత్న ఆలోచనలకు సృజనాత్మకత జోడించి ప్రతిపాదనలతో రావాలని సూచించారు. 18 – 19 సంవత్సరాల మధ్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావలసిన ఉన్న దృష్ట్యా ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్దం చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, జిల్లా పాఠశాల విద్యా అధికారి కే. వాసుదేవ రావు, ఎస్ఎస్ఎ ప్రాజెక్ట్ అధికారి ఎస్. సుభాషిణి, ఆర్ ఏం సి వైద్య అధికారి డా వి. వినూత్న, డిప్యూటీ డి ఈ వో – ఈ. నారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News