-ప్రతీ మొదటి ఏడాది విద్యార్ధికి 5 కుటుంబాలు మ్యాపింగ్
– డా. బి. సోభాగ్య లక్ష్మీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా లో వైద్య విధ్య అభ్యశిస్తున్న ప్రధమ సంవత్సరం ఎంబిబిఎస్ విధ్యార్థులకు సమాజ పరిచయము మరియు సమాజములో నెలకొనియున్న వివిధ ఆరోగ్య పరిస్థితులు వాటిపై ఆధారపడియున్న ఆరోగ్య అంశముల పై అవగాహన కల్పించే విధముగా జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకముల ప్రకారము స్థానిక వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. సౌభాగ్య లక్ష్మి దిశా నిర్దేశం మేరకు, వైస్ ప్రిన్సిపాల్ ( అకడెమిక్ ), డా. కె వి. శివప్రసాద్ , కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డా. వి వి దుర్గాప్రసాద్ నేతృత్వములో ఫ్యామిలి అడాప్షన్ కార్యక్రమము నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమమును వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. సౌభాగ్య లక్ష్మి లాంఛనముగా ప్రారంభించటం జరిగింది. ఈ సందర్భముగా ప్రిన్సిపాల్ డా. సౌభాగ్య లక్ష్మి మాట్లాడుతూ ఈ కార్యక్రమము ద్వారా వైద్య విద్యార్థులు వారికి కేటాయించిన కుటుంబాలు దర్శించి వారి వద్ద నుంచి కుటుంబ, ఆహార, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక స్థితిగతులను సేకరించి వారిని చైతన్యవంతులు చేసే విధముగా ప్రేరేపించాల్సి ఉంటుందనీ అన్నారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాన్ని అర్ధంచేసుకొని పూర్తిగా అవగాహన చేసుకోవాలని వైద్య విధ్యార్ధులుకు పిలుపునిచ్చారు. వైస్ ప్రిన్సిపాల్ (అకడెమిక్), డా. కె.వి. శివప్రసాద్ మాట్లాడుతూ విధ్యార్థులకు ఈ కార్యక్రమము ద్వారా సమాజము పరిచయము అవుతుందని ప్రజల ఆరోగ్య అవసరాలు తెలుసుకొని వారిని చైతన్యం చేయాలని తెలియజేశారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డా. వి వి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విధ్యార్థులకు అన్నమాచారి రోడ్, దుర్గా నగర్ , వాంబే కాలనీ ల పరిధిలో ఉన్న అర్బన్ ఏరియా లలో గల కుటుంబాలను ఒక్కొక్కరికి 5 చోప్పున కేటాయిస్తారని తెలియ చేశారు. ఆ యా కుటుంబాలను విద్యార్దులు ఆరోగ్య భద్రత కోసం దత్తత తీసుకొని మొదటగా కుటుంబాలను పరిచయం చేసుకొని వారి వ్యక్తిగత ఆరోగ్య వివరాలు సేకరించి సూచించిన వైద్య పరీక్షలు చేయాలన్నారు . ఈ విషయంలో పూర్తి గోప్యత పాటించి తదుపరి వారి అవసరాల మేరకు వైద్య మరియు ఆరోగ్య పరముగా తీసుకోవలసిన చర్యలు లేదా సూచనలు ఇవ్వాలని వివరించారు. ఈ కార్యక్రమము మెడిసిన్ విభాగ అధిపతి డా. వి వి దుర్గాప్రసాద్ , సమన్వయ అధికారి డా. సురేంద్ర బాబు మాట్లాడుతూ ఈ ప్రత్యేక కార్యక్రమములో ప్రతి విధ్యార్థి పాల్గొని ప్రజలతో మమేకమై ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని వారికి భరోసా కల్పించాల్సి ఉంటుందన్నారు. వారి వారి ఆరోగ్య, వైద్య అవసరాలు తీర్చి దిద్దడములో తగిన సూచనలు ఇవ్వడమే కాక సమాజాన్ని అర్ధం చేసుకోవటానికి వీలుగా విధ్యార్ధులను టీమ్ లుగా విభజించి వారికి శిక్షణ ఇవ్వడం జరిగినదని వివరించారు. ఈ కార్యక్రమములో అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఫణి మాధవి మాట్లాడుతూ ఇది ఒక ప్రత్యేక అవకాశముగా తీసుకొని వైద్య విద్యార్దులు పని చేయాలని తెలియజేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వి. సూర్యా రావు ఈ కార్యక్రమము విశిష్టతను వివరించినారు. ఈ కార్యక్రమములో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. వి. సూర్యా రావు,.అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఫణి మాధవి , సమన్వయ అధికారి డా. సురేంద్ర బాబు , కమ్యూనిటి విభాగపు సిబ్బంది , సామాజిక శాస్త్రం లెక్చరర్స్ ఆషా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News