రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి భూముల రిజిస్ట్రేషన్, రీ సర్వే, ఇనాం అసైన్ ల్యాండ్, పంచాయతీ రాజ్, వైద్య ఆరోగ్య, ఆరోగ్యశ్రీ అంశాలపై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కే . మాధవీలత , జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్ డబ్ల్యు ఎస్ రాష్ట్ర స్థాయి ప్రథాన ఇంజనీర్ వి. రవికుమార్ , ఇతర జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత జిల్లా ప్రగతిపై సమగ్ర నివేదికను వివరిస్తూ, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు రిజిస్ట్రేషన్ లో భాగంగా జిల్లాలో 63,389 మందికి గాను 43,914 ఇళ్ళ రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. ఉపాధిహామీ పథకం కింద జిల్లాకు చెందిన 48 లక్షల పని దినాలకి గానూ 45 లక్షల 42 వేల (94.62%) మేర లక్ష్యాలను సాధించడం జరిగిందనీ పేర్కొన్నారు. జిల్లాలో రీ సర్వే ప్రక్రియ లో భాగంగా ఈనాం – అసెస్మెంట్ భూములకు సంబంధించిన 62 గ్రామాల్లో 1622 ఎకరాలలో 1370 ఎకరాల్లో అసెస్మెంట్ చేసినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను పంపిణీ చెయ్యడం కోసం మెడికల్, డివిజనల్ డెవలప్మెంట్ అధికారుల ద్వారా సమన్వయం చెయ్యడం జరుగుతోందని అన్నారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి కార్డుల పంపిణీ కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో 5,60,000 వేల హెల్త్ కార్డులకు గాను 4,32,000 కార్డులు అందాయని, వాటిలో 3,44,000 పంపిణీ చేయడం జరిగిందినీ అన్నారు. డీ వార్మింగ్ డే ను ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్స్ లో చేపట్టినట్లు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2 దశ శిబిరాలను ప్రణాళిక మేరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్.డబ్ల్యు.ఎస్. చీఫ్ ఇంజనీర్ వి. రవికుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఆర్ డబ్ల్యు ఎస్ – ఎస్ ఈ డీ. బాల శంకర రావు, డి పి వో డి. రాంబాబు , డ్వామా పిడి ఏ . ముఖ లింగం, వైద్యాధికారులు డా కె. వేంకటేశ్వర రావు, డా పి. ప్రియాంక, డి ఐ వో బి. వేంకటేశ్వర రావు, పి ఆర్ ఎస్ ఈ ఎండి ఆలిముల్లా, తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News