Breaking News

‘సాయి భాస్కర్ హాస్పిటల్స్’ విజన్-2030

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యవిధానం ద్వారా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో ముందున్న ‘సాయి భాస్కర్ హాస్పిటల్స్’ విజన్-2030తో లక్ష్యంగా ముందుకు సాగుతుంది. మంగళవారం, బందరోడ్డులోని ఓ హోటల్లో ‘సాయి భాస్కర్ హాస్పిటల్స్’ ఆధ్వర్యంలో ‘బెటర్ వాక్ బెటర్ బ్రీత’ అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సాయి భాస్కర్ హాస్పిటల్స్’ ఎండీ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రోబోటిక్ శస్త్రచికిత్స ఖరీదుగా భావిస్తున్నా.. పరిస్థితిని మార్చి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ధ్యేయంతో ఉన్నామన్నారు. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీని దేశంలోనే ప్రధాన వైద్య విధానంగా మార్చడమే లక్ష్యంగా విజన్-2030తో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఉన్నతి ఫౌండేషన్ ద్వారా 2016లో గుంటూరు సర్వజన ఆసుపత్రిలో ఉచితంగా రోబోటిక్ శస్త్రచికిత్సలు చేయడం ప్రారంభించామని, ఇప్పటివరకు సుమారు రూ.కోటి విలువ గల 142 శస్త్రచికిత్సలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం 50శాతం రోబోటిక్ సర్జరీలు జరుగుతున్నాయని తెలిపారు. రోబోటిక్స్ ద్వారా శస్త్రచికిత్సల్లో అత్యంత ఖచ్చితత్వం, భద్రత, మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయన్నారు. రోగులు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ కోసం ఎక్కువ ఖర్చులు పెట్టుకుని మెట్రోపాలిటన్ నగరాలకు వెళ్ళకుండా మన అమరావతిలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలలోనే అన్ని ప్రాంతాల వారికి అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శస్త్రచికిత్స చేసుకున్న వారికి మొక్కలను పంపిణీ చేశారు. అంతేకాకుండా ఎవర్ గ్రీన్ ఫౌండేషన్ ద్వారా మొక్కలను గుంటూరు పరిసర ప్రాంతాల్లో నాటిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్ట్రైకర్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అమన్ రిషి, బిఎంఆర్ గ్రూప్ చైర్మన్ బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, ఏపీ టెక్స్‌టైల్స్ ఫెడరేషన్ చైర్మన్ బచ్చు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *