Breaking News

ప్రతి విద్యార్థి దినచర్యలో యోగా ఒక భాగం కావాలి

-విద్యార్థులను ఆరోగ్యంగా, ఏకాగ్రతతో, భావోద్వేగ సమతుల్యతతో తీర్చిదిద్దడమే లక్ష్యం
-సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, IAS
-ఏపీ సమగ్ర శిక్ష ఏపీ – హార్ట్‌ఫుల్‌నెస్ ఆధ్వర్యంలో యోగా శిక్షణా శిబిరం ప్రారంభం
-కాన్హా శాంతి వనంలో ప్రారంభమైన 3 రోజుల యోగా శిక్షణ
-935 పీఎంశ్రీ పాఠశాలల నుండి హాజరైన 1,870 మంది ఉపాధ్యాయులు

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో సమగ్ర విద్యా విధానానికి ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు ఆదర్శంగా నిలవాలని, జాతీయ విద్యా విధానం 2020 ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను నిరంతర అభ్యాసకులుగా, బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాలల్లో సురక్షితమైన, ఆనందదాయకమైన అభ్యాస వాతావరణం ఎంతో అవసరంమని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, IAS అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష, హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (హైదరాబాద్) సంయుక్త భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ పీఎంశ్రీ పాఠశాలల ఉపాధ్యాయులకు మూడు రోజుల పాటు రెసిడెన్షియల్ విధానంలో యోగా శిక్షణా కార్యక్రమం హైదరాబాదులోని ‘కాన్హా శాంతి వనం’లో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. అక్టోబర్ 7 వరకు జరిగే ఈ శిక్షణ జరుగుతుంది. కార్యక్రమంలో గ్లోబల్ హార్ట్‌ఫుల్‌నెస్ గైడ్ దాజీ , యోగా అకాడమీ డైరెక్టర్ డా. వెరోనిక్ నికోలాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీడీ బి. శ్రీనివాసరావు, IAS ప్రసంగిస్తూ… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 935 పీఎంశ్రీ పాఠశాలల నుండి ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున మొత్తం 1,870 మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ పొందిన ఈ ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో హెడ్‌మాస్టర్ల మార్గదర్శకత్వంలో హార్ట్‌ఫుల్‌నెస్ యోగా అకాడమీ నిపుణుల సహకారంతో యోగాను ప్రతీ విద్యార్థి దినచర్యలో ఒక భాగం చేయాలని అన్నారు. యోగా ద్వారా మన పిల్లలు శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత, మానసిక పటిష్టతలు పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదిగేలా కృషి చేయాలని అన్నారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు యోగా వార్మ్-అప్స్, సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, విశ్రాంతి పద్ధతులలో ప్రత్యక్ష శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయిన ఉపాధ్యాయులకు తమ పాఠశాల ‘లీడ్ టీచర్ ఫర్ యోగా’గా ధృవీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. పాఠశాలల్లో నిర్వహించే యోగా సెషన్లు, అంతర్జాతీయ యోగా దినోత్సవం వంటి కార్యక్రమాల పురోగతిని ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా నివేదించే విధానంపై కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు.
అనంతరం హార్ట్‌ఫుల్‌నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవి శంకర్ బల్లా మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ నుండి పాల్గొన్న ఉపాధ్యాయులకు కాన్హాలో ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ఉపాధ్యాయులు యోగా స్ఫూర్తిని తమ పాఠశాలలకు చేరవేసి, లక్షలాది మంది విద్యార్థుల శ్రేయస్సుకు, ఉజ్జ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తారని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలకు నాందిగా.. నగరంలో ‘స్పేస్ వాక్’

-విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరంలో ఈ నెల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *