Breaking News

Konduri Srinivasa Rao

గత ప్రభుత్వం వ్యాపారస్తులను వేధిస్తే..నేటి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుంది

-ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల, అన్ని ప్రాంతాల ప్రజల ఆదరణను పొందుతూ, బ్రహ్మాండమైన అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేష్ స్పష్టం చేశారు. ఈ రెండు సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని ఆయన కొనియాడారు. ప్రజల సమస్యలపై ఎవరైనా నిర్మాణాత్మకంగా, పారదర్శకంగా ప్రశ్నిస్తే సమాధానం …

Read More »

రాజ‌ధాని గ్రామాల‌లో సిప్ ప‌నులు ఉన్న‌త ల‌క్ష్యాలు సాధించాలి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధాని అమ‌రావ‌తి గ్రామాల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన (Capital Investment and Infrastructure Projects) మూలధన పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ప‌నులు ల‌క్ష్యాల‌ను సాధించాల‌ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి వారు అధికారులను ఆదేశించారు. శ‌నివారం రాజ‌ధాని గ్రామాలైన మ‌ల్కాపురం, మంద‌డం, కృష్ణాయ‌పాలెం, ఎర్ర‌బాలెం, రాయ‌పూడి ప్రాంతాల‌లో జ‌రుగుతున్న సిప్ అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు. రాజ‌ధాని గ్రామాల‌లో నివ‌శిస్తున్ ప్ర‌జ‌ల‌కు మంచినీటి స‌ర‌ఫ‌రా, చెరువుల సుంద‌రీక‌ర‌ణ‌, వ‌ర్ష‌పు …

Read More »

అనంతవరంలో APCRDA గ్రామసభ నిర్వహణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నగర నిర్మాణం నిమిత్తం భూసేకరణ కార్యకలాపాలకై అనంతవరంలో APCRDA ఆధ్వర్యంలో శనివారం గ్రామసభ జరిగింది. నేడు జరిగిన గ్రామసభలో కమిషనర్ వి.విజయరామరాజు ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ ఐఏఎస్, కె.కార్తీక్ ఐఏఎస్ హాజరయ్యారు. రాజధాని నగరంలో నిర్మిస్తున్న రహదారులు, LPS జోన్లు, తదితర అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం భూసమీకరణ(ల్యాండ్ పూలింగ్- LPS) చేపట్టామని.. సమీకరణకు కొందరు రైతులు, భూయజమానులు ముందుకు రానందున..రైతులతో పలుమార్లు చర్చించిన అనంతరం నిర్ణీత విధానంలో మాత్రమే ఇటీవల భూసేకరణ ప్రక్రియకై …

Read More »

డివిజన్లో ప్రతి సమస్యను పరిష్కరిస్తాం

-ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ -ప్రజా దర్బార్ కు పోటెత్తిన ప్రజా సమస్యలు -55వ డివిజన్ ప్రజాదర్బార్లో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న నాగుల్ మీరా ఎంఎస్ బేగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో ఎంపీ కేశినేని చిన్ని ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూర్ బాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మేరా, గ్రంథాలయ చైర్మన్ ఎం ఎస్ బేగ్ పాల్గొని …

Read More »

సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ కు అనూహ్య స్పందన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని వించిపేట మసీదు వద్ద సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ క్యాంపులో 54, 55 డివిజన్ల ప్రజలు విశేషంగా వైద్య సహాయం పొందారు. క్యాంప్ ద్వారా పలు సాధారణ అనారోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు. ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, …

Read More »

నియోజక వర్గ స్థాయి కమిటీలలో స్థాన కల్పనకు వివరాల స్వీకరణ

-క్యాడర్ టూ లీడర్ స్థాయి కోసం వివరాల స్వీకరణ -ఇందుకోసం పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీల ఏర్పాటు -కమిటీల నివేదికల పరిశీలనకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కమిటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇందులో భాగంగా నియోజక వర్గాల్లో క్యాడర్ టూ లీడర్ స్థాయి కల్పనకు వివరాలు స్వీకరిస్తారు. ఆ స్థానం కల్పనకు నియోజక వర్గాల నుంచి వ్యక్తిగత వివరాలు, పార్టీకి చేసిన సేవలు తెలియచేసే పత్రాలను స్వీకరిస్తారు. సంస్థాగత నిర్మాణం, …

Read More »

విద్యుత్ చార్జీలు యూనిట్ కి ఒక రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది…

ఏలూరు/అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు యూనిట్ కి ఒక రూపాయి తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చెప్పారు. అగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో శనివారం 4. 31 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 కె.వి. సబ్ స్టేషన్ ను రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన …

Read More »

పీఎం మోదీ, సీఎం చంద్రబాబు సూచనలతో ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి

-భవిష్యత్తులో ఇంధన పొదుపు చాలా కీలకం కానుంది -ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారించక తప్పదు -తొలి నుంచి పునరుత్పాదక విద్యుత్ కు కూటమి ప్రభుత్వం పెద్దపీట -సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇస్తూ విద్యుత్ ఛార్జీలు తగ్గించేలా అడుగులు -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంధన పొదుపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. …

Read More »

పి. నైనవరం గ్రామంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-రూ. 42 లక్షల వ్యయంతో నిర్మించిన ‘స్వర్ణ గ్రామం’ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే -రూ. 15 లక్షలతో నిర్మించనున్న ఐదు సిమెంట్ రోడ్ల పనులకు శంకుస్థాపన -గ్రామాభివృద్ధి పనుల కోసం మొత్తం రూ. 2.13 కోట్ల నిధులు కేటాయింపు -ప్రజల ఆరోగ్యం, గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వర్ణాంధ్ర కార్యక్రమం: ఎమ్మెల్యే యార్లగడ్డ -పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రతి ఒక్కరూ తగ్గించాలని పిలుపు -పి. నైనవరం సహా రూరల్ మండలంలోని 9 గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC)లో విలీనం చేసేందుకు ప్రతిపాదన …

Read More »

మే 19న వెడ్డింగ్ ట్రూసో & లగ్జరీ హ్యాంపర్స్‌ పై ప్రత్యేక మాస్టర్ క్లాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఛాంబర్స్ ఉమెన్స్ వింగ్ – సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో మే 19, 2026న విజయవాడలో వెడ్డింగ్ ట్రూసో & లగ్జరీ హ్యాంపర్స్‌ (పెళ్లి కానుకలు మరియు లగ్జరీ గిఫ్ట్ ప్యాకింగ్) పై ఒక ప్రత్యేక మాస్టర్ క్లాస్ నిర్వహించబడుతోంది. సృజనాత్మక బహుమతులు (క్రియేటివ్ గిఫ్టింగ్), లగ్జరీ హ్యాంపర్ స్టైలింగ్ మరియు ట్రూసో ప్యాకింగ్ విధానాలపై ఆసక్తి ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలు, గృహిణులు, ఔత్సాహిక వ్యాపార మహిళల కోసం ఈ వర్క్‌షాప్ ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో పాల్గొనేవారు …

Read More »