Breaking News

Konduri Srinivasa Rao

ఉమీద్ పోర్టల్ నమోదులో ఘన విజయం సాధించిన ఏపీ వక్ఫ్ బోర్డు

– 8,681 వక్ఫ్ సంస్థలు, 82,567 ఎకరాల వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ పూర్తి – ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉమీద్ సెంట్రల్ పోర్టల్‌ అదనపు 6 నెలల గడువు జూన్ 6 తో ముగిసిందని, పోర్టల్ లో వక్ఫ్ ఆస్తుల నమోదులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఘన విజయాన్ని సాధించిందని చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. గడువు ముగిసింది పాత వక్ఫ్ ఆస్తుల నమోదుకేనని నూతన రిజిస్ట్రేషన్ లకు …

Read More »

పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు పర్యటన

-సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం -రైతులతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి -6 నెలల్లో 26.46 లక్షల పాస్ పుస్తకాలు రైతులకు అందజేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లోని తప్పులను సరిదిద్దుతూ ప్రజా ప్రభుత్వం రైతులకు కొత్త పుస్తకాలను అందిస్తోంది. రైతుల సమక్షంలోనే రీ సర్వే చేసి వారి ఆమోదంతో పాస్ పుస్తకాలను ఇస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతీ నెలా మీ భూమి-మీ హక్కు …

Read More »

రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. పిడుగులతో కూడిన వర్షాలు కర్ణాటక పరిసర ప్రాంతాల నుండి కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ …

Read More »

యోగాతో ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యం – మంత్రి కొల్లు రవీంద్ర

-యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు.. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలని, సుసంపన్నమైన, ఆనందమయమైన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం-2026 వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర-2026 …

Read More »

యోగాంధ్ర.. రిజిస్ట్రేషన్ల జోరు

-కోటి మందిని భాగస్వాములను చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో తొలి రోజు 25 వేల మంది పేర్లు నమోదు -రాష్ట్ర వ్యాప్తంగా యోగా సందడే సందడి -మాస్టర్ల ట్రైనర్ల ద్వారా 50,752 మందికి శిక్షణ కార్యక్రమాలు -భారతీయ సంస్కృతికి ‘యోగా’ ఓ ప్రతీక… లేపాక్షిలో మంత్రి శ్రీ సత్యకుమార్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర-2026 ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నుంచి ఉత్సాహ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21నాడు జరిగే భారీ …

Read More »

ప్రతి కాల్ వెనుక ఒక ప్రాణం… ప్రతి స్పందన వెనుక 108

-గోల్డెన్ అవర్‌లో గోల్డెన్ సర్వీస్ -108 అంబులెన్స్ ల రూపు రేఖలు మార్చేసిన కూటమి ప్రభుత్వం -ఒక్క ఏడాదిలోనే 7.78 లక్షల అత్యవసర కేసులకు సత్వర స్పందన -భవ్య హెల్త్ కేర్ ఆధ్వర్యంలో మరో మైలురాయి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నట్టే 108 అంబులెన్స్ సర్వీసులూ లక్షలాదిమందికి ప్రాణదాతగా నిలుస్తూ సమర్థతను చాటుకుంటున్నాయి. ప్రతి నిమిషం ప్రాణ రక్షణే లక్ష్యంగా అత్యవసర సేవలు అందిస్తున్నాయి. భవ్య హెల్త్ కేర్ ఆధ్వర్యంలో అంబులెన్స్ లకు …

Read More »

సీఎం చంద్రబాబు ట్వీట్

-సత్యనారాయణ గారూ… రేపు సిద్ధాంతంలో కలుద్దాం -ఆచంట నియోజకవర్గానికి చెందిన ఓ వృద్ధుని కోరిక మేరకు స్పందించి సీఎం చంద్రబాబు ట్వీట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తనను కలవాలన్న ఓ వృద్ధుని కోరికకు స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణకు చంద్రబాబు అంటే ఎంతో అభిమానం. ఒక్కసారైనా చంద్రబాబును కలవాలని అనుకున్నారు. రేపు సిద్ధాంతంలో జరిగే మీ భూమి…మీ హక్కు కార్యక్రమానికి వస్తోన్న సీఎం చంద్రబాబు సభకు …

Read More »

బి. ఆర్. టి. ఎస్. రోడ్డు లో అత్యంత ఘనంగా పోలీసు యోగాంధ్రా కార్యక్రమం

-గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆనంద ఆంధ్రప్రదేశ్ రావాలి… : రాష్ట్ర హోంశాఖా మాత్యులు వి.అనిత -పోలీసు శాఖలో మానసిక శారీరక ఆరోగ్యం పెంపొందించడానికి పోలీసు యోగాంధ్రా… : నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 07 నుంచి జూన్ 21 వ‌ర‌కు యోగాంధ్ర పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో …

Read More »

ఆర్టీసి పరిరక్షణ, ఉధ్యోగుల సమస్యలు పరిష్కారానికి ఉధ్యమ కార్యాచరణను నేడు ప్రకటిస్తాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో నెలకొన్న ఉద్యోగ, కార్మిక సమస్యలు, ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా ప్రవేశపెట్టనున్న విద్యుత్ బస్సుల వల్ల సంస్థ భవిష్యత్తుపై ఏర్పడే ప్రభావం, ఉద్యోగుల సంక్షేమం, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై చర్చించేందుకు జూన్ 8వ తేదీన విజయవాడలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఆర్టీసీలోని వివిధ ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్లు ఏపీపిటిడి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్‌ఎంయూఏ) రాష్ట్ర అధ్యక్షులు వై. శ్రీనివాసరావు, …

Read More »

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక…

-కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 8వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Read More »