Breaking News

Konduri Srinivasa Rao

ఎన్.పి.సి.ఐ ప్రక్రియను ఈనెల జూన్ 11వ తేదీ లోపు  పూర్తి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : (తల్లికి వందనం పథకం ఎస్.సి కులములకు చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం  అడ్మిషన్ పొందిన విద్యార్థులు జూన్, 11 వ తేదీలోపు నూతన బ్యాంకు ఖాతా ఓపెన్ చేయుట మరియు NPCI పోర్టల్ నందు అనుసంధానం చేయించుట కొనుట.) తల్లికి వందనం పథకం క్రింద లబ్ది పొందుటకు 2026-2027 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం  అడ్మిషన్ పొంది, అర్హత కలిగిన (ఎస్.సి ) షెడ్యూల్డు కులములకు చెందిన విద్యార్థులు తమ పేరుతో నూతనముగా బ్యాంకు ఖాతాను …

Read More »

ఈ నెల 8న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో పాటు డివిజన్, …

Read More »

ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్‌తో రైతులకు భరోసా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని అనిగండ్లపాడు గ్రామంలో కాంపాక్ట్ బ్లాక్‌లో 10 ఎకరాలు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (Pre-Monsoon Dry Sowing) కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన పంట అయిన బొప్పాయి తోటల్లో 2 ఎకరాల ప్రీ మొన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పంటల వైవిధ్యాన్ని పెంచుతున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా పంటలను ముందుగానే విత్తడం ద్వారా రైతులు …

Read More »

యోగాంధ్ర 2026 ఘనంగా ప్రారంభం – ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యం

-కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు, యోగాంధ్ర–2026 కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైనట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమం తొలి రోజున విజయవాడ నగరంలోని రివర్ ఫ్రంట్ పార్క్ , కృష్ణాలంక , భవానీపురం , అలాగే Dr. బి …

Read More »

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని అధికారులందరూ …

Read More »

నగరంలో “బ్రాహ్మణ సంక్షేమ ఆత్మీయ చర్చా గోష్టి”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో బ్రాహ్మణ సామాజికవర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు “బ్రాహ్మణ సంక్షేమ ఆత్మీయ చర్చా గోష్టి” జరిగింది. ఆదివారం గాంధీనగర్లోని ఐలాపురం హోటల్‌లో “బ్రాహ్మణ సంక్షేమ ఆత్మీయ చర్చా గోష్టి” రాష్ట్రస్థాయి సమావేశం శ్రీ వేద విజ్ఞాన పరిషత్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ శాసనసభ్యులు మల్లాది వాసు తదితర ప్రముఖులు హాజరై ప్రసంగించారు. వారు మాట్లాడుతూ.. బ్రాహ్మణ …

Read More »

ఘనంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కార్యాలయంలో సామంచి శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, మరిన్ని విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు.

Read More »

తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన బనానా క్లబ్ షోరూమ్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బనానా క్లబ్ షోరూమ్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, విశిష్ట అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్‌ను సందర్శించిన అతిథులు అక్కడ అందుబాటులో ఉన్న వస్త్రాలు, ఆధునిక డిజైన్లు, వినియోగదారులకు అందిస్తున్న ప్రత్యేక సేవలను పరిశీలించి అభినందించారు. …

Read More »

యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగా సాధన చేసిన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర” కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తో పాటు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్  పాల్గొని యోగా సాధన చేశారు. ఈ …

Read More »

ఇంధన ధరలు తగ్గించాలి

– రేపు రాష్ట్ర వ్యాప్త రాస్తారోకోలను జయప్రదం చేయాలి – సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై భారీ భారం మోపుతోందని సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు విమర్శించారు. గత 90 రోజుల్లో గృహ వినియోగ గ్యాస్ ధరను రూ.89 పెంచారని, అలాగే 11 రోజుల్లోనే నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. …

Read More »