Breaking News

Konduri Srinivasa Rao

యోగాంధ్ర–2026 కార్యక్రమాలను విజయవంతం చేయాలి… : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 7 నుండి 21వ తేదీ వరకు గుంటూరు నగరంలో నిర్వహించనున్న యోగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ నగరపాలక సంస్థ అధికారులను, సచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో సంబంధిత అధికారులకు కమిషనర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో సుమారు 5 లక్షల …

Read More »

అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ జి.సాంబశివరావు విభాగాదిపతులకు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు …

Read More »

అగ్ని ప్రమాదం జరగకుండా ఖచ్చితంగా నివారణ చర్యలు పాటించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఆదేశాల మేరకు వీఎంసీ రీజినల్ ఫైర్ ఆఫీసర్ రత్నబాబు ఆధ్వర్యంలో విజయవాడ ఎం.జి.రోడ్డులోని శుభమస్తు షాపింగ్ మాల్‌లో ఆకస్మిక అగ్నిమాపక భద్రతా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా భవనంలో పలు కీలక అగ్నిమాపక భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించారు. భవనంలో ఏర్పాటు చేసిన అగ్నిమాపక భద్రతా పరికరాలు సక్రమంగా పనిచేయడం లేదని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు ఇనుప షీట్లతో పూర్తిగా మూసివేయబడి ఉండటంతో అవి …

Read More »

నీటి నిల్వల నివారణకు మేజర్ ఔట్‌ఫాల్ డ్రైన్లలో విస్తృతంగా గుర్రపుడెక్కల తొలగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని మేజర్ అవుట్‌ఫాల్ డ్రైన్లలో గుర్రపుడెక్కల తొలగింపు పనులను విస్తృతంగా చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్‌లోని కండ్రిక జంక్షన్ వద్ద ఉన్న మేజర్ అవుట్‌ఫాల్ డ్రైన్‌లో పేరుకుపోయిన గుర్రపుడెక్కలను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపాలకృష్ణమూర్తి పర్యవేక్షణలో తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు మరియు చీఫ్ ఇంజనీర్ (ఇన్‌చార్జ్) పి. సత్యకుమారి మార్గదర్శకత్వంలో నగరపాలక సంస్థ …

Read More »

ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కమిషనర్, …

Read More »

ఉచిత యోగా శిక్షణతో యోగాంధ్ర 2026

-నగర ప్రజలకు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “యోగాంధ్ర – ఆరోగ్యాంధ్ర 2026” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నగర పరిధిలోని కందుకూరు కళ్యాణ మండపం, బర్మ్ పార్క్ ప్రాంతం మరియు అంబేద్కర్ స్మృతి వనం వద్ద ప్రత్యేక యోగా కార్యక్రమాలు బిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకుల ఆధ్వర్యంలో కామన్ యోగ ప్రోటోకాల్ …

Read More »

ప‌శు సంప‌ద‌తో గ్రామాల్లో సుస్థిర సంప‌ద‌

– అన్న‌దాత‌లకు అద‌న‌పు ఆదాయానికి వీలు – పాడి ప‌శువుల్లో పున‌రుత్ప‌త్తిపై ప్ర‌త్యేక దృష్టి – ప‌శువుల ఉత్పాద‌క‌త పెంపున‌కు కార్యాచ‌ర‌ణ‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధికి పశుసంపద కీలకమని, పాడి పరిశ్రమ అభివృద్ధి ద్వారా రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో స్థిర‌మైన పాల ఉత్ప‌త్తి ద్వారా రైతుల ఆదాయాన్ని సుస్థిరం చేసేందుకు ప‌శు కేంద్రీకృత పున‌రుత్ప‌త్తి నిర్వ‌హ‌ణ విధానంపై …

Read More »

ప్రజల సంతృప్తే పనితీరుకు గీటురాయి..

– సేవల నాణ్యతే సుప‌రిపాల‌న‌కు స‌రైన ప్రమాణం – అర్జీల పరిష్కారంలో జవాబుదారీతనంతో వ్యవహరించాలి – నిర్ల‌క్ష్యం, బాధ్య‌తారాహిత్యం క‌నిపిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్జీల ప‌రిష్కారంలో ప్రజల సంతృప్తే ప‌నితీరుకు గీటురాయ‌ని.. సేవ‌ల నాణ్య‌తే సుప‌రిపాల‌న‌కు స‌రైన ప్ర‌మాణ‌మ‌న్న విష‌యాన్ని గుర్తించి అధికారులు ప్ర‌జ‌ల ఫిర్యాదుల ప‌రిష్కారంపై ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో ప్ర‌జా స్నేహ‌పూర్వ‌క పీజీఆర్ఎస్ …

Read More »

పవన్ కళ్యాణ్ చేపడుతున్న అనేక అభివృద్ధి, ప్రజాసేవ, సంక్షేమ కార్యక్రమాల్లో మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణాలు ఒక మచ్చుతునక లాంటివి

-సోమవరంలో మ్యాజిక్ డ్రెయిన్ పరిశీలించిన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు -మ్యాజిక్ డ్రెయిన్ నిర్మాణం ద్వారా దోమల బెడద, మురుగు నీటి దుర్వాసన తప్పిందని నాగబాబు కి సంతోషం వ్యక్తం చేస్తూ తెలిపిన స్థానిక మహిళలు 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ. 40 కోట్లతో 500 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించిన కె. నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతితో కూడిన దూరదృష్టికి ప్రతిరూపం ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి …

Read More »

ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ఏపీఎఐఎంఎస్ 2.0 దోహదం

– రైతులకు ఇబ్బందులు లేకుండా ఎరువుల పంపిణీ జరగాలి – కౌలు రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి – కృత్రిమ కొరత, మళ్లింపులను అరికట్టేందుకు విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేయాలి – జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు రూపొందించిన ఏపీఎఐఎంఎస్ 2.0 వ్యవస్థను విజయవంతంగా అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. …

Read More »