Breaking News

Monthly Archives: December 2024

శ్రీ హరిపురం కాలనీ, కేతనకొండ ప్లాట్ ఓనర్స్ ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీహరిపురం కాలనీ కేతనకొండ ప్లాట్ ఓనర్స్ న్యాయం జరగాలని, శ్రీహరిపురం కాలనీ లేఅవుట్ డెవలప్మెంట్ పనులు పూర్తి చేయించాలని, మార్ట్ గేజ్ ప్లాట్లు సభ్యులు 69 మందికి ప్లాట్లను కేటాయించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయించాలని, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. శ్రీనివాస్ అన్నారు. స్థానిక గాంధీనగర్ ధర్నా చౌక్ లో శనివారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీహరిపురం గవర్నమెంట్ ఎంప్లాయిస్ కోపరేటివ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నావి పోతవరం ప్రెసిడెంట్ వి. శ్రీనివాస్ మాట్లాడుతూ …

Read More »

శ్రీ కనకదుర్గా అమ్మవారికి 2 లక్షలు విరాళం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైట్ ఫీల్డ్, బెంగుళూరు కు చెందిన దాత వెలుగురి కుమార్ శ్రీ అమ్మవారి దేవస్థానం నందు కానుకగా ఈ -హుండీ నిమిత్తం రూ.2,00,000/-లును ఆలయ ఈవో కె ఎస్ రామరావు ని కలిసి విరాళముగా చెక్కు రూపములో అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం చేయించగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.

Read More »

దేదీప్యమానంగా కలశ జ్యోతి ఊరేగింపు

-43 వసంతాల కలశ జ్యోతి ఊరేగింపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా భద్రప్రియా, భద్రమూర్తిః, భక్తసౌభాగ్య దాయినీ... అని లలితా సహస్ర నామములో కీర్తించిన రీతిగా భవుడైన శివుని సతీమణి భవానీ. ఆ భవానీని ధ్యానిస్తూ, కీర్తిస్తూ, పూజిస్తూ చేసే దీక్షే భవానీ దీక్ష. ఇంద్రకీలాద్రి పై కొలువున్న దుర్గా అమ్మవారిని నియమబద్ధ దీక్షతో పూజించి, అమ్మ అనుగ్రహం పొందటానికి గానూ కంచి కామకోటి పీఠాధిపతుల ఆదేశానుసారం 1981 నుండి భవానీ దీక్షలు, కలశ జ్యోతి ఊరేగింపు …

Read More »

‘కలశజ్యోతి ఊరేగింపులో సకల కళార్చన’

-శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ మండలదీక్షలను పురస్కరించుకుని కలశజ్యోతి ఊరేగింపు శనివారం సాయంత్రం శివరామనామ క్షేత్రం ప్రాంగణం సకల కళార్చనలతో శోభిల్లింది -శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సనాతన ధర్మప్రచారం, ఆధ్యాత్మిక వ్యాప్తి కొనసాగింది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మిక, ధార్మిక, ప్రాచీన, సంప్రదాయ కళా ప్రదర్శనల మేళవింపులో వికారాబాద్‌ అటవీ ప్రాంతానికి చెందిన గిరిజనుల కొమ్ముకోయ నృత్యం(కొమ్ము డోలు)కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ కు చెందిన సంప్రదాయ చెండా మేళం -పంచ …

Read More »

అమ్మవారిని దర్శించుకున్న ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ అమ్మవారి దర్శనార్థం  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భగవత్ శనివారం ఆలయమునకు విచ్చేయగా వీరికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్ మరియు ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డిప్యూటీ ఈవో ఎం రత్న రాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్బంగా వీరు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి వేదంపండితుల ఆలయ వేదపండితులచే …

Read More »

అభివృద్ధి పనులను నిర్దేశిత గడవు మేరకు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలి…

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ ల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడవు మేరకు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్ కృష్ణ నగర్, స్తంభాల గరువు, పట్టాభిపురం ప్రాంతాల్లో పర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టే రోడ్ల నిర్మాణం డ్రైన్ టు డ్రైన్ చేయాలని, డ్రైన్లను …

Read More »

జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏపీఎఫ్ఎంఐఎస్ చట్టం 1997 మరియు 2018 వ సంవత్సరం సవరణ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ తిరుపతి వారి ఆదేశముల మేరకు తిరుపతి జిల్లా నందు 34 మండలాల్లో గల 610 నీటి వినియోగదారుల సంఘములకు ఎన్నికలు 14.12.2024 నేటి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం ఏడు గంటల వరకు ముగించబడినది. అందుకు గాను 3600 మంది ఎన్నికల సిబ్బందిని నియమించి వినియోగించడం జరిగింది. మొత్తం 610 నీటి …

Read More »

డిసెంబర్ 16 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్

-నేడు డిసెంబర్ 15 ఆదివారం కలక్టరేట్ లో పొట్టి శ్రీరాములు వర్ధంతి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి పి జి ఆర్ ఎస్ కార్యక్రమం డిసెంబర్ 16 వ తేదీ సోమవారం యధావిధిగా  నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు సోమవారం  ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను కలెక్టరేట్ లో స్వీకరిస్తామని …

Read More »

మెగా డిఎస్సీ పోటీ పరీక్షల స్క్రీనింగ్ టెస్టు విజేతలకి శిక్షణా తరగతులు ప్రారంభం

-పోటీ పరీక్షలలో విజయం సాధించేందుకు ఇదొక సువర్ణావకాశం -రాజమహేంద్రవరంలోబీసీ స్టడీ సర్కిల్ ను శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి.ప్రశాంతి -ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని శిక్షణ పొందేందుకు వచ్చిన అభ్యర్థులను అభినందించిన మంత్రి దుర్గేష్ -కష్టం, ప్రతిభను నమ్ముకునే వారికీ కూటమి ప్రభుత్వం చేయూత నిస్తుందన్న అభయమిచ్చిన మంత్రి దుర్గేష్ -ఎస్సీ యాక్షన్ ప్లాన్ లా త్వరలోనే బీసీ యాక్షన్ ప్లాన్.. తద్వారా యువతకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్న మంత్రి దుర్గేష్ -శిక్షణ …

Read More »

ఇంటింటా విద్యుత్ పొదుపు..ఊరంతా వెలుగు

-కరెంట్ ఆదా చేద్దాం.. భావితరాలకు భరోసానిద్దాం. -14 డిసెంబర్ నుండి 20 వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన  జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్ -ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపుపై అవగాహన తప్పనిసరి -జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ప్రారంభించిన.. -పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ విలువైందని.. దానిని వృధా కాకుండా …

Read More »