Breaking News

జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏపీఎఫ్ఎంఐఎస్ చట్టం 1997 మరియు 2018 వ సంవత్సరం సవరణ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ తిరుపతి వారి ఆదేశముల మేరకు తిరుపతి జిల్లా నందు 34 మండలాల్లో గల 610 నీటి వినియోగదారుల సంఘములకు ఎన్నికలు 14.12.2024 నేటి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం ఏడు గంటల వరకు ముగించబడినది. అందుకు గాను 3600 మంది ఎన్నికల సిబ్బందిని నియమించి వినియోగించడం జరిగింది. మొత్తం 610 నీటి వినియోగ దారుల సంఘాలకు గాను 3690 టీసీలు (టెర్రిటరీ కాన్స్టిట్యూన్సీ) కలవు. సాయంత్రం 5 గం.ల వరకు 610 నీటి వినియోగదారుల సంఘాలకు గాను 406 ఫలితాలు డిక్లేర్ చేయడం జరిగింది. 3690 టీసీ లకు గాను 2831 టీసీ లకు ఫలితాలు ప్రకటన చేయడం జరిగిందని, నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిందని సూపరింటెండెంట్ ఇంజనీర్ తెలుగు గంగ ప్రాజెక్టు మదన గోపాల్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *