-లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు – రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రమాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (వర్కింగ్ ప్రెసిడెంట్‌గా) బాధ్యతలు స్వీకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »Daily Archives: April 29, 2026
ఆరుగురు చేనేత ప్రముఖులకు టీడీపీ పదవులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ పదవులు చేనేత వర్గానికి చెందిన ఆరుగురు ప్రముఖులను వరించాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఉదయం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ తోపాటు పార్టీ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసింది. పద్మశాలి సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గుత్తికొండ ధనుంజయ రావు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా ప్రమాణస్వీకారం చేయగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన …
Read More »రాయితీతో పన్ను చెల్లింపుకు ఒక్క రోజే గడువు, గురువారం అర్ధరాత్రి 11 గంటల వరకు క్యాష్ కౌంటర్లు అందుబాటులో… : కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2026-27) సంబందించిన ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించి పన్నుపై 5 శాతం, బకాయిల వడ్డీపై 50 శాతం రాయితీ పొందేందుకు గురువారం ఒక్క రోజే గడువు ఉందని, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నును ముందస్తుగా ఏక మొత్తంగా చెల్లించే వారికి ప్రకటించిన 5 శాతం రాయితీని నగర ప్రజలు విస్తృతంగా వినియోగించుకుంటున్నారని, …
Read More »అభివృద్ధి పనుల పై విభాగాధిపతులతో సమీక్షా సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నూతన డ్రైన్ నిర్మాణ పనులు 10 రోజుల్లో, నిర్మాణదశలో ఉన్న డ్రైన్లు 15 రోజుల్లో పూర్తీ చేయాలని, అందుకు ఇంజినీరింగ్ అధికారులదే భాధ్యత అని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి సిఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తో కలిసి విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత కమిషనర్ నగరపాలక సంస్థ చేపడుతున్న అభివృద్ధి …
Read More »మహిళల ఆర్థిక స్వాలంభనకు స్వయం ఉపాధి కీలకం….
-మహిళలను పారిశ్రామిక వేత్తలను చేయాలన్నదే లక్ష్యం. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థిక స్వాలంభన సుస్థిర భవిష్యత్తుకు స్వయం ఉపాధి మార్గాలు కీలక పాత్ర వహిస్తాయని ప్రతి మహిళలను పారిశ్రామిక వేత్తగా తిర్చిదిద్ది ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా అధికారులు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా …
Read More »ఇసుక రీచ్‌లకు టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయండి…..
-ఇసుక సరఫరా విధానాన్ని పారదర్శకంగా అమలు చేయండి.. -నిబంధనలు ఉల్లంగించకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయండి.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇసుక సరఫరాను మరింత సులభతరం చేసేందుకు జిల్లాలో మరో ఐదు ఇసుక రీచ్‌లకు టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఇసుక సరఫరా విధానాన్ని పారదర్శంగా అమలు చేయడంతో పాటు నిబంధనలను ఉల్లంగించకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక సరఫరా అమలుపై బుధవారం కలెక్టర్ డా. …
Read More »ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత కల్పించడం జరిగినప్పటికీ.. నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని సమన్వయ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును పరిశీలించారు. …
Read More »పన్ను వసూళ్ళ ప్రత్యేక డ్రైవ్ లో మొండి బకాయిదారుల ఆస్తులకు జప్తు నోటీసు
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి పన్ను మరియు డ్రైనేజి పన్నుల బకాయిలు వసూళ్ళలో భాగంగా మూడు సర్కిళ్ళ పరిధిలో పన్నుల వసూళ్ళ డ్రైవ్ నిర్వహిస్తున్నారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అందులోభాగంగా బుధవారం ఉదయం సర్కిల్ – 1 పరిధిలోని భవానిపురం లో ని బ్యాంకు కాలనీ లోగల 22 ఖాళీ స్థల పన్ను బకాయిదారులకు జప్తు నోటీసు …
Read More »మానసిక శారీరక వికాసానికి సమ్మర్ క్యాంప్ ని వినియోగించుకోండి- దరఖాస్తులకు నేడే చివరి తేదీ
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్నారుల మానసిక మరియు శారీరక వికాసానికి విజయవాడ నగరపాలక సంస్థ వారు మే 1 నుండి 30, 2026 వరకు నిర్వహించే వేసవి శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని కమిషనర్ ధ్యానచంద్ర పిలుపునిచ్చారు. ఈ వేసవి శిక్షణలో పాల్గొనాలంటే దరఖాస్తులకు ఏప్రిల్ 30, 2026 చివరి తేదీ అని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు నేడే చివరి రోజు అని తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విజయవాడ నగరపాలక …
Read More »వేసవిలో మొక్కల సంరక్షణకు చర్యలు వేగవంతం చేయాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవిలో మొక్కల సంరక్షణకు చర్యలు వేగవంతం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రాణి గారి తోట, నేతాజీ బ్రిడ్జ్, ఎంజి రోడ్, బెంజ్ సర్కిల్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని వర్టికల్ గార్డెన్స్ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎండ తీవ్రత వల్ల …
Read More »
Prajavartha Online Telugu News