జాతీయ స్థాయి అండర్ – 17 ‘సెపక్ తక్రా’ పోటీలకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు

-అభినందించిన సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ స్థాయి అండర్ – 17 ‘సెపక్ తక్రా’ పోటీలకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎంపికైనట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీ జి.భానుమూర్తిరాజు  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15 నుండి 21 వరకు మణిపుర్ రాష్ట్రం ఇంఫాల్ శాయ్ సెంటర్లో జరగనున్న పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS., ని ఏపీ జట్టు కలిశారు. సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు  బి.శ్రీనివాసరావు IAS.,  బృందాన్ని అభినందించి, విజయవంతంగా రావాలని ఆకాంక్షించారు.
అండర్-17 బాలురు జట్టు
1. జి. సతీష్ (దేవరాపల్లి, పశ్చిమగోదావరి)
2. ⁠కె. కుశల్ (కేబీసీ బాయ్స్ హైస్కూల్, పటమట, ఎన్టీఆర్ జిల్లా)
3. ⁠డీఎం. షాహిద్ (ఉరవకొండ, అనంతపురం)
4. ⁠టి . జశ్వంత్ (విశాఖపట్నం)
5. ⁠టి . వంశీ (కేబీసీ బాయ్స్ హైస్కూల్, పటమట, ఎన్టీఆర్ జిల్లా)
అండర్ 17 బాలికలు జట్టు
1. పి. హరి ప్రియ (కేబీసీ)
2. ⁠కె. వెంకట లక్ష్మి (కేబీసీ)
3. ⁠పి. దుర్గ మధుర శ్రీ (దేవరాపల్లి, ప.గో)
4. ⁠సి. తేజ (ఉరవకొండ)
5. ⁠జి. రమ్య (కాకినాడ)
ఈజట్లుకు పీఈటీలు కోచ్ గా ఎస్. రమేష్ (ఎన్టీఆర్), బాలికల మేనేజర్ ⁠ఎం. సంతోషి కుమారి (కర్నూలు), బాయ్స్ టీమ్ మేనేజర్ డి. సుంకర రావు (కర్నూలు) వ్యవహరిస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విద్యుత్ రంగం బలోపేతానికి తక్షణ ఆర్థిక సాయం అవసరం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం బలోపేతానికి ఆర్థికంగా సాయం చేయాలని ఏపీ విద్యుత్ శాఖ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *