Breaking News

భూమి పరిరక్షణ మన అందరి బాధ్యత.

-వై డి రామారావు, చైర్మన్, ఏపీ రెడ్ క్రాస్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్య సంరక్షణ, భూమి పరిరక్షణ కై బాధ్యత తీసుకోవలసిన తరుణం ఆసన్నమైనదని రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ వైడి రామారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని భారతీయ విద్యాభవనసు నందు నిర్వహించిన ప్రపంచ ధరిత్రి దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మనిషి సౌకర్యవంతమైన జీవనం మరియు తన అవసరాల కోసం ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను దుర్వినియోగపరుస్తూ భావితరాలకు కాలుష్య భరిత భూమిని అందజేస్తున్నారని రామారావు ఆవేదన చెందారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా భూమి పరిరక్షణకై అందరూ ప్రతిజ్ఞ చేసి పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలు కళాశాలలోని విద్యార్థులను చైతన్యపరిచి ప్లాస్టిక్ నివారణ, మొక్కల పెంపకం వంటి అంశాలతో అవగాహన తరగతులు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

జిల్లా అటవీ శాఖ అధికారి హిమ శైలజ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలలో మొక్కల పెంపకాన్ని విరివిగా చేపడుతున్నామని, మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణ ను బాధ్యతగా స్వీకరించి మొక్కలను చెట్లుగా ఎదిగే వరకు వాటిని సంరక్షించాలని ఆవిడ తెలిపారు. అధిక విద్యుత్ వినియోగం, అనవసర నీటి వాడకం, అధిక సంఖ్యలో వృక్షాలను నరకడం వంటి వాటి వలన భూమి సమతుల్యత దెబ్బతింటున్నదని Sach తెలిపారు. అడవులలో వృక్ష సంపద తగ్గడంతో అటవీ జీవాలు మానవ ఆవాసాల వైపు వస్తున్నాయని దీని నివారణకు అడవుల పెంపకం, వృక్ష సంరక్షణ అనివార్యమని ఆమె తెలిపారు.

రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కోశాధికారి రామచంద్ర రాజు మాట్లాడుతూ బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరు భూమి సంరక్షణకై ముందుకు రావాలని, భావితరాలకు కాలుష్య రహిత భూమిని అందజేయడానికి అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గుంటూరు రీజినల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నజీనా బేగం మాట్లాడుతూ పరిశ్రమలు, బహుళ అంతస్తుల నిర్మాణదారులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి పెక్కు సంఖ్యలో మొక్కలు నాటి, తమ సామాజిక బాధ్యతను గుర్తు ఎరగాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంటాక్ గుంటూరు జిల్లా కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రవి వడ్లమాని, భారతీయ విద్యా భవన్ ప్రిన్సిపల్  హేమాంబ, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, రెడ్ క్రాస్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *