అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లాలోని PAC కార్యాలయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు జనసేన పార్టీ PAC సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో హరిప్రసాద్ మాట్లాడుతూ, భారతదేశ మహానుభావులు డా. బి.ఆర్. అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు మహాత్మా గాంధీ వంటి మహనీయుల లక్షణాలు కలిగిన నాయకత్వ గుణాలు మన నాయకుడు పవన్ కళ్యాణ్ లో ఉన్నాయని పేర్కొన్నారు. పార్టీ ఐక్యతతో ముందుకు సాగి, రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా, జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం సాధించిన విశేష విజయాన్ని జిల్లా అధ్యక్షులు అభినందించారు. నరేంద్ర దండి వ్యక్తిగతంగా 5,005 సభ్యత్వాలు నమోదు చేసి నియోజకవర్గ స్థాయిలో ప్రథమ స్థానం, జిల్లా స్థాయిలో మూడవ స్థానం సాధించడమే కాక రాష్ట్రవ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శన చేసిన నియోజకవర్గాలలో శ్రీకాళహస్తి ఒకటిగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి సహకరించిన ప్రతి జనసేన కార్యకర్తకు అభినందనలు తెలిపారు. డా. పసుపులేటి హరిప్రసాద్, కార్యకర్తల ఉత్సాహాన్ని అభినందిస్తూ, నరేంద్ర దండి నాయకత్వంపై వచ్చిన అభిప్రాయాలను మరియు ప్రతిపాదనను పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు మరియు శ్రీకాళహస్తి బోర్డు సభ్యులు దండి రాఘవయ్యతో పాటు చిన్నతోటి నాగరాజు, దీన్‌దయాల్, భాగ్యమ్మ, లక్ష్మణ్, నవీన్, శశి, జయశంకర్, ధన, వెంకటరమణ, రవి, సుధీర్, శ్రీను, తిరుమల, చంద్ర, దివాకర్, గిరి, శ్రీనివాసులు, వరదరాజు, బొక్కిసం వెంకట్రామయ్య, రాజశేఖర్, మునిరామయ్య, బాలరాం, నారాయణ, జయరాం, సుబ్బు, లోకేష్, కుమార్, ముకేష్, తిలక్, శ్రీహరి, రామ్ తదితర ముఖ్య నాయకులు మరియు పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News