పాలకొల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్వా జోన్, నాన్-ఆక్వా జోన్ నిబంధనలతో సంబంధం లేకుండా, అర్హులైన ఆక్వా రైతులందరికీ ప్రభుత్వం తరపున పూర్తి ప్రయోజనం చేకూరుస్తామని రాష్ట్ర వ్యవసాయ మరియు మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పాలకొల్లు బ్రాడీపేట బైపాస్ రోడ్డులో మంగళవారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆక్వా రైతుల కృతజ్ఞత మహాసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ, మరియు మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చం నాయుడు, మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు , జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర వ్యవసాయ మరియు మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చం నాయుడు మాట్లాడుతూ, ప్రధానరంగం అయిన ఆక్వారంగానికి ఆక్వా జోన్, నాన్-ఆక్వా జోన్ అని తేడా లేకుండా 10 ఎకరాల పైబడి ఉన్న ఆక్వా రైతులందరికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం యూనిట్ విద్యుత్తు కు రూ.1.50 పైసలు చొప్పున సబ్సిడీని అమలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన రైతులు ముందే జీవో ఆర్ టి నెంబరు విడుదల చేయడం జరిగిందని అన్నారు. అన్ని వర్గాలు నిండు మనసుతో ఆశీర్వదించడం వల్ల కూటమి పాలన అధికారంలోకి రావడం జరిగింది అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా 2024 అధికారంలోకి వచ్చే సమయానికి ఆనందం కన్నా భయం ఎక్కువగా ఉండేదని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు నెరవేర్చడంతోపాటు, ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టడం జరిగిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో 99 శాతం హామీలు అమలు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఇవ్వనీ హామీలు కూడా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఇరిగేషన్ పనులు శాశ్వతంగా ఆధునికరించడం జరుగుతుందని రహదారులన్నీ వేయడం జరుగుతుందని అన్నారు. 26 నెలల కూటమి పాలనలో రైతులను అనేక విధాలుగా ఆదుకోవడం జరిగిందని అన్నారు. ఆక్వా రంగం ముఖ్యమంత్రి కి మానస పుత్రిక అని ఆక్వా రంగాన్ని దేశంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ఈ ఏడాది తీవ్రమైన ఎండల కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, దీనివల్ల ఆక్వా రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. గత 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ట్రాన్స్‌ఫార్మర్ల నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. అయితే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే వ్యవస్థ అంతా గాడి తప్పిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ట్రాన్స్‌ఫార్మర్ల నిర్మాణ పనులను వేగవంతం చేశామని మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో 160 మెగావాట్ల ట్రాన్స్‌ఫార్మర్ పనులు ప్రగతిలో ఉన్నాయని, నరసాపురంలో కూడా నూతన సబ్‌స్టేషన్ నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆక్వా రైతులకు, సామాన్య రైతులకు లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థల ఆధునికీకరణ కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. పాలకొల్లులో కూడా నూతన సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపిందని మంత్రి మండిపడ్డారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గడిచిన రెండు సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా కరెంట్ బిల్లు పెంచలేదని చెప్పడానికి తాను గర్వపడుతున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది రైతులకు తమ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోందని తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలతో పాటు చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును సబ్సిడీ రూపంలో అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్, సబ్సిడీల కోసమే ప్రభుత్వం ఏటా రూ.15 వేల కోట్లు భరిస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమమునకు అధ్యక్షత వహించిన.
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఆక్వా రైతులపై విద్యుత్ భారాన్ని తగ్గించి వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని అన్నారు. ఆక్వా రైతులకు యూనిట్ కు రూ.1.50 పైసలు సబ్సిడీ ఇవ్వటం వలన ఎకరానికి 84 వేల రూపాయలు ఆదా అవుతుంది రూ .1100 కోట్లు కూటమి ప్రభుత్వం బరాయిస్తుందని ఆయన అన్నారు.
***రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కానుమూరి రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ, ఆక్వా రంగానికి తిరుగులేని, అత్యంత ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని, అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా వనరులను సద్వినియోగం చేసుకోవడంపైనే మన విజయం ఆధారపడి ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆక్వా రంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు వలస కార్మికుల కొరత, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కార్మికుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. రాబోయే మూడు, నాలుగేళ్లలో ఈ కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో, స్థానికంగా పనివారు లభించని పరిస్థితిని అధిగమించడానికి ‘ఆక్వా యూనివర్సిటీ’ తక్షణమే ఆధునికీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తక్కువ మంది పనివారితోనే మెరుగైన ఫలితాలు సాధించేలా ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి. ముఖ్యంగా రొయ్యలు, చేపల పెంపకం, చెరువుల నిర్వహణ, మరియు దిగుబడి సేకరించడం ప్రక్రియలలో సరికొత్త మెషిన్లు, ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాలి. సాంకేతికతపై ఇప్పుడే దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం అని ఆయనఅన్నారు. ఆక్వా రైతులకు ఉన్న ఈ సువర్ణావకాశాన్ని నిజం చేసుకోవడానికి ప్రభుత్వ సహకారం, భాగస్వామ్యం ఎంతో అవసరం అని ఆయన అన్నారు. మన సమస్యలను, అవసరాలను ప్రభుత్వానికి సమర్థవంతంగా వివరించి, పరిష్కారాలు సాధించుకోవాలనీ, ఒకప్పుడు పశ్చిమ గోదావరిలో అందరి ఇళ్ల ముందు బెంజ్ కార్లు ఉంటాయని దేశమంతా చెప్పుకునేవారు. ఆ స్థాయిని మళ్లీ సాధించి, ప్రతి ఆక్వా రైతు ఇంటా సంపద, సంతోషం నింపడమే మన లక్ష్యమని అన్నారు. ఆక్వా రంగానికి అందమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి అందరూ కలిసికట్టుగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమమునకు అధ్యక్షత వహించిన. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఆక్వా రైతులపై విద్యుత్ భారాన్ని తగ్గించి వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రూ.1.50 పైసలు కె సబ్సిడీ అమలు చేస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని అన్నారు. ఆక్వా రైతులకు యూనిట్ కు రూ.1.50 పైసలు సబ్సిడీ ఇవ్వటం వలన ఎకరానికి 84 వేల రూపాయలు ఆదా అవుతుంది రూ .1100 కోట్లు కూటమి ప్రభుత్వం బరాయిస్తుందని ఆయన అన్నారు.
***ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ఆక్వా రంగానికి అందరికీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 57 కారణంగా జిల్లాలో 13,000 వేలమందికి మరో 3,500 మంది ఈ సబ్సిడీ ద్వారా లబ్ధి పొందుతారని అన్నారు. ఆక్వా రైతులకు ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం ముందుండి వారి సమస్యలను తీర్చడం జరుగుతుందని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మరియు ఆచంట శాసనసభ్యులు పితాని సత్యనారాయణ, కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, రాష్ట్ర ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆక్వా రైతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, ఆక్వాహబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయుడు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఆర్డీవో దాసిరాజు, కూటమి ప్రభుత్వం నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News