విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేషనల్ లైబ్రేరియన్స్ డే సందర్భంగా డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథం జన్మదినాన్ని పరిష్కరించుకుని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో లైబ్రరీఎన్స్ నీ ఘనంగా సత్కరించటం జరిగింది. బుధవారం మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎం.ఎస్ బేగ్ పాల్గొన్నారు. సిద్ధార్థ మహిళా కాలేజ్ లైబ్రేరియన్ మల్లికా, లయోలా కాలేజ్ లైబ్రేరియన్ రోజా, ఠాగూర్ గ్రంథాలయ లైబ్రేరియన్స్ కే రమాదేవి గ్రేడ్ వన్ జి ఉమారాణి రాణి గ్రేడ్ 2 , ధనలక్ష్మి గ్రేడ్ 3, డి నాగేశ్వరరావు గ్రేడ్ 3 లైబ్రరీఎన్స్ ని దుస్సాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రంధాలయ పాలకుల సేవలను కొనియాడారు. అలాగే పద్మశ్రీ ఎస్ సర్ రంగనాథన్ పుస్తకాన్ని పాటకుడి దగ్గరకు పాటకుడుని జ్ఞానం దగ్గరకు తీసుకువెళ్లిన మహనీయుడు ఎస్సార్ రంగనాథన్. ఆయనను భారత దేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడుగా గౌరవిస్తారు. 1931 లో అయినా ప్రసిద్ధ గ్రంథం 5 లాక్స్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. మొదటి సూత్రం 1.అధ్యయనం కొరకు పుస్తకం, ప్రతి చదువరికి ఒక పుస్తకం, ప్రతి పుస్తకానికి ఒక చదువరి, చదువరి సమయం వృధా చేయరాదు, గ్రంథాలయం ఒక అభివృద్ధి చెందుతున్న జీవం వంటిది పుస్తకాలు పాఠకులు సాంకేతిక సేవలు కాలానుగుణంగా పెరుగుతూ మారుతూ ఉండాలని ఐదు సూత్రాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News