విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ను చిట్టినగర్ లోని శ్రీ నగరాల సీతారామస్వామిశ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థాన నూతన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరిని బుధవారం , తాడి గడపలోని క్యాంపు కార్యాలయంలో కలిసి దుశ్శాలువ తో సత్కరించారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని కమిటీ సభ్యులు తెలిపారు ఆలయ గౌరవాధ్యక్షులు రాయన అదిబాబు, అధ్యక్షులు పోతిన భేసు కంటేశ్వరుడు , వైస్ ప్రెసిడెంట్ తమ్మిన సూర్య కుమారి, సెక్రటరీ తొత్తడి భరత్, జాయింట్ సెక్రటరీ పనుకు రమ, పిళ్ళ రవీంద్ర, రవి ప్రసాద్, బెవర సాయి సుధాకర్, నగరాల నాయకులు గుజ్జారీ అమర్ ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News