-ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్యమే లక్ష్యం – రూ.22లక్షల నూతన Fully Automated ImmunoAssyAnalyzerప్రారంభం
-ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లే అవసరం తగ్గింపు – APSRTC ఉద్యోగులకు ఆధునిక వైద్య పరీక్షలు అందుబాటులోకి
-99%కిపైగా ఖచ్చితత్వంతో పరీక్షలు – గంటలో 100 నమూనాల వరకు ఫలితాలు
-ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు మరింత మెరుగైన వైద్య సేవలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
APSRTC ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, విద్యాధరపురంలోని APSRTC సెంట్రల్ హాస్పిటల్లో రూ.22 లక్షల విలువైన నూతన ఫుల్లీ ఆటోమేటెడ్ ఇమ్యూనోఅస్సే అనలైజర్ (Fully Automated Immuno Assay Analyzer)ను APSRTC వైస్-చైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్శ్రీ ఎన్. బాల సుబ్రహ్మణ్యం, ఐ.పి.ఎస్.ఈ రోజు ప్రారంభించారు.
ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సెంట్రల్ హాస్పిటల్లో అధునాతన వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగానే ఈ నూతన పరికరాన్ని ఏర్పాటు చేసినట్లు VC & MD తెలిపారు. ఈ పరికరం అందుబాటులోకి రావడంతో పలు ముఖ్యమైన వైద్య పరీక్షలనుAPSRTC హాస్పిటల్లోనే నిర్వహించుకునే అవకాశంకలుగుతుందని, తద్వారా ప్రైవేట్ డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడంతో పాటు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకుసమయం, శ్రమ మరియు వైద్య పరీక్షలపై అయ్యే ఖర్చు ఆదాఅవుతుందని పేర్కొన్నారు.
ఈ ఆధునిక పరికరం ద్వారా ప్రధానంగా క్రింది వైద్య పరీక్షలు నిర్వహించవచ్చు:
• థైరాయిడ్ ప్రొఫైల్స్ – T3, T4, TSH
• ట్యూమర్ మార్కర్లు – CA 19-9, CA 125, PSA
• కార్డియాక్ మార్కర్లు
• విటమిన్ పరీక్షలు – Vitamin D, Vitamin B12
• వైరల్ మార్కర్లు – Hepatitis B, Hepatitis C, RVD
• ఫాస్టింగ్, PPBS, ఇన్సులిన్, C-Peptide స్థాయిల పరీక్షలు
• Type-1, Type-2 Diabetes, MODY, LADA వంటి మధుమేహ రకాల గుర్తింపుకు సహకారం
• వివిధఇన్ఫెక్షన్ వ్యాధుల మార్కర్ల పరీక్షలు
• రక్తంలోనిఔషధ స్థాయిల పరీక్షలు
• నమూనాలోనిఅతి స్వల్ప పదార్థాలను గుర్తించే పరీక్షలు.
ఈ పరికరం ద్వారా99 శాతానికి పైగా ఖచ్చితత్వంతో పరీక్షా ఫలితాలుపొందవచ్చని తెలిపారు. ఒకేసారి60 నమూనాలను 30 నిమిషాల్లో, ఒక గంటలో100 నమూనాల వరకుపరీక్షించే సామర్థ్యం ఈ పరికరానికి ఉంది. దీంతో వ్యాధులను ముందుగానే గుర్తించడం, సరైన చికిత్సను నిర్ణయించడం, వేగవంతమైన వైద్య నిర్ధారణ అందించడం ద్వారా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
APSRTC ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, సెంట్రల్ హాస్పిటల్లో ఆధునిక వైద్య సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఈ పరికరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని VC & MD తెలిపారు. నూతన అనలైజర్ ద్వారా అందుబాటులోకి వచ్చే అధునాతన పరీక్షలు ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగులకునాణ్యమైన వైద్య సేవలతో పాటు ఆర్థిక ప్రయోజనాన్ని కూడా కల్పించనున్నాయి.
ఈ సందర్భంగా VC & MD శ్రీ ఎన్. బాల సుబ్రహ్మణ్యం, ఐ.పి.ఎస్. సెంట్రల్ హాస్పిటల్ వైద్యులు మరియు వైద్య సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, APSRTC ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణను అత్యంత బాధ్యతతో, అంకితభావంతో చేపట్టాలని సూచించారు. ఉద్యోగులు తమ విధుల్లో నిరంతరం సేవలందిస్తూ సంస్థ అభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తించి, వారికి అవసరమైన వైద్య సేవలను సానుభూతి, మానవతా దృక్పథం మరియు సేవా స్ఫూర్తితో అందించాలని అన్నారు. ఆధునిక వైద్య సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, సరైన మార్గదర్శకత్వం మరియు సకాలంలో వైద్య పరీక్షలు అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులను కోరారు.
ఈ కార్యక్రమంలోశ్రీ కె.ఎస్.బి. రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్); శ్రీ జీవీ రవి వర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్); శ్రీ ఎస్.టి.పి. రాఘవ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్); డా. ఆర్. శ్రీకాంత్ రెడ్డి, CMO; డా. కె. అమృతవల్లి, SMO; డా. ఎస్.ఎస్. స్వామి, SMO (ENT)తో పాటు ఇతర పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు
Prajavartha Online Telugu News