Breaking News

సెప్టెంబర్ 4, 5 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ విజయవంతం

-ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్లకు విస్తృత అవగాహన – దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 4, 5 తేదీల్లో నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్పెషల్ క్యాంపెయిన్ డేస్‌ను ఎఈఆర్వోలు విజయవంతంగా నిర్వహించారు.

ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేస్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు అవసరమైన సేవలు, దరఖాస్తుల విధానం, ఓటర్ల జాబితాలో పేర్ల పరిశీలన, వివరాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా యువ ఓటర్లు, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే అర్హత కలిగిన పౌరులు, ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేదా వివరాలను సరిచూసుకోవాల్సిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా అధికారులు సూచనలు చేశారు. స్పెషల్ క్యాంపెయిన్ డేస్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) అందుబాటులో ఉండి, ఓటర్ల నుంచి వచ్చిన సందేహాలను నివృత్తి చేయడంతో పాటు అవసరమైన దరఖాస్తుల స్వీకరణ, పరిశీలనకు సంబంధించిన ప్రక్రియను చేపట్టారు. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *