Breaking News

జిల్లా పరిషత్ సమావేశ మందిరం, జిల్లా పరిషత్ అతిథి గృహం ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక రూ. 60 లక్షల జిల్లాపరిషత్ నిధులతో ఆధునికీకరించిన ఎన్టీఆర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరాన్ని, జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని సోమవారం విజయవాడలో ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాకు కొత్తగా ఏర్పడే పాలకవర్గానికి సమావేశ మందిరంతో పాటు అతిథి గృహాన్ని ఆధునీకరించి అన్ని మౌలిక వసతులతో ఈరోజు భవనాలను ప్రారంభించడం జరిగిందన్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ ఆఖరి చైర్ పర్సన్ గా నేను ఉండడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. జిల్లాల సరిహద్దులు మాత్రమే మారినా మనం సేవ చేయాలనే ఉద్దేశం మాత్రం అలానే ఉంటుంది కాబట్టి అన్ని ప్రాంతాలు జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ వైస్ చైర్ పర్సన్ లు శ్రీదేవి, కృష్ణంరాజు, జడ్పిటిసి సభ్యులు వేముల సురేష్, అన్నవరం ఎలిజిబెత్ రాణి, కొమరవెల్లి గంగాభవాని, జిల్లా పరిషత్ ఉపముఖ్య కార్యనిర్వహణాధికారి ఆనంద కుమార్, కృష్ణాజిల్లా పంచాయతీరాజ్ ఎస్ఈ రమణ, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *