Breaking News

జ్యువల్ నిధి నూతన జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవంలో డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యువల్ నిధి జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని నూతన షోరూమ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ… నేటి పోటీ ప్రపంచంలో ప్రజల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులు, మెరుగైన సేవలు అందించే సంస్థలు మాత్రమే దీర్ఘకాలికంగా ప్రజల ఆదరణను పొందగలవని పేర్కొన్నారు. తిరుపతి వంటి ఆధ్యాత్మిక, వాణిజ్య నగరంలో నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం నగర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. అదే సమయంలో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడానికి కూడా ఇటువంటి సంస్థలు ఉపయోగపడతాయని అన్నారు. జ్యువల్ నిధి జ్యువెలరీ షోరూమ్ బంగారం, వెండి, వజ్రాభరణాలు, ఫ్యాషన్ జ్యువెలరీ రంగంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని పొందాలని ఆకాంక్షించారు. నూతనంగా ప్రారంభించిన ఈ సంస్థ యాజమాన్యం వ్యాపార రంగంలో మరిన్ని విజయాలు సాధించి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరుతూ షోరూమ్ యాజమాన్యానికి డా. పసుపులేటి హరిప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జ్యువల్ నిధి షోరూమ్ యాజమాన్యం, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అభిమానులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *