Breaking News

మెగా డీఎస్సీ–2025లో టెట్ అర్హతలు, స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం

-స్పోర్ట్స్ డీఎస్సీ అభ్యర్థులపై వచ్చిన ఆరోపణలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, శాప్ మేనేజింగ్ డైరెక్టర్ వివరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పోర్ట్స్ కోటా ద్వారా నిర్వహించిన మెగా డీఎస్సీ–2025లో కొందరు అభ్యర్థుల టెట్ అర్హతలు, కుల ధ్రువీకరణ, క్రీడా సర్టిఫికెట్ల ప్రామాణికతపై వివిధ మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలలో ఏమాత్రం వాస్తవాలు కావని రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ శ్రీమతి తమీమ్ అన్సారియా మరియు SAAP వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి భరణి స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారిరువురు పాల్గొని అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు, నిబంధనలు, సంబంధిత సంస్థల ధ్రువీకరణల ఆధారంగా కేసుల వారీగా వివరణ ఇచ్చారు.

మెగా డీఎస్సీ–2025లో TET, విద్యార్హతలు, కేటగిరీ, క్రీడా అర్హతలను సంబంధిత నిబంధనలు, అధికారిక రికార్డులు, ధ్రువీకరణల ఆధారంగా కేసు వారీగా పరిశీలించామని తెలిపారు. అభ్యర్థులు పొందుపర్చిన ఏదైనా సర్టిఫికెట్ నకిలీదని లేదా అర్హత నిబంధనలకు విరుద్ధమని నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని, అదే సమయంలో కేవలం ఆరోపణల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ప్రతి కేసును అధికారిక ఆధారాల ప్రాతిపదికన నిష్పక్షపాతంగా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియలో పారదర్శకత, నిబంధనల అమలు, అధికారిక ఆధారాల పరిశీలనకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వారు పేర్కొన్నారు.

రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ శ్రీమతి తమీమ్ అన్సారియా టెబ్ అర్హతపై స్పష్టమైన నిబంధనలను మరియు ఆరోపణలకు గురైన అభ్యర్థులకు సంబందిచిన విషయాలను వివరిస్తూ…..

టెట్ అర్హతపై స్పష్టమైన నిబంధనలు…
భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో 1–8 తరగతుల ఉపాధ్యాయ నియామకాలకు TETను ముఖ్యమైన అర్హతగా నిర్దేశించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో TET అమలుకు G.O.Ms.No.51, dated 16.04.2011 ద్వారా మార్గదర్శకాలు జారీ అయ్యాయన్నారు. TET ఉత్తీర్ణత ప్రమాణాలు OC/EWSకు 60% (90/150), BCలకు 50% (75/150), SC/ST/PwBD/Ex-Servicemenకు 40% (60/150)గా ఉన్నాయన్నారు.

ఉపాధ్యాయ నియామకాల్లో TET స్కోరుకు 20% మరియు TRT రాత పరీక్షకు 80% వెయిటేజీ ఆధారంగా మెరిట్ రూపొందుతుందన్నారు. Physical Education Teacher, School Assistant (Physical Education), Physical Director, PGT, Principal పోస్టులకు ప్రత్యేక TET అర్హత వర్తించదన్నారు.

టెట్ ఆరోపణలపై కేసుల వారీగా వాస్తవాలు…

1. ఈడిగా ప్రభాకర్ – కర్నూలు
Sports DSC–2025లో SGT పోస్టుకు దరఖాస్తు చేసి, హాకీ విభాగంలో Sports Quota ద్వారా ఎంపికైన ఎడిగా ప్రభాకర్పై నిర్దేశిత టెట్ మార్కులు లేవనే ఆరోపణ వచ్చిందన్నారు. అయితే ఈ అభ్యర్థి టెట్ పరీక్షలకు హాజరయినట్లు మరియు 2018లో Paper-II-Bలో 77 మార్కులు సాధించినట్లు రికార్డుల్లో ఉందన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారమన్నారు.

2. జంపాల ఉష – కర్నూలు
BC-A కేటగిరీకి చెందిన జంపాల ఉషపై కూడా నిర్దేశిత TET అర్హత లేదనే ఆరోపణ వచ్చిందన్నారు. అయితే 2011–2017 మధ్య Language Teachers కోసం ప్రత్యేక Paper-II ఉండేది కాదన్నారు. అభ్యర్థులు Mathematics & Science లేదా Social Studies విభాగాల్లో Paper-II పరీక్ష రాసేవారన్నారు. BC అభ్యర్థులకు అప్పట్లో 50 శాతం, అంటే 75/150 మార్కులు ఉత్తీర్ణత ప్రమాణంగా ఉండేదన్నారు.

జంపాల ఉష 2012 జనవరి, 2012 మేలో వరుసగా 79, 80 మార్కులు, 2017లో 76 మార్కులు సాధించారన్నారు. అందువల్ల అప్పటి నిబంధనల ప్రకారం ఆమె TET అర్హతను సంతృప్తి పరిచినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.

3. మిరియాల గాయత్రి సాయి శ్రీ – తూర్పుగోదావరి
OC కేటగిరీకి చెందిన మిరియాల గాయత్రి సాయి శ్రీపై TET అర్హత లేదనే ఆరోపణ నిర్ధారణ కాలేదన్నారు. OC అభ్యర్థులకు 90/150 మార్కులు కనీస అర్హత కాగా, ఆమె APTET–2024 Paper-II-A, SA-Teluguలో 97.89 మార్కులు సాధించారన్నారు. అందువల్ల ఆమె TET అర్హతను సంతృప్తి పరిచినట్లు నిర్ధారించబడిందన్నారు. అనంతరం Sports Quota కింద SA-Telugu పోస్టుకు ఎంపికై తూర్పుగోదావరి జిల్లాలో నియమితులయ్యారన్నారు.

4. ప్రగడ కళ్యాణి – విశాఖపట్నం
BC-A కేటగిరీకి చెందిన ప్రగడ కళ్యాణిపై కూడా TET అర్హతపై ఆరోపణ వచ్చిందన్నారు. BC అభ్యర్థులకు 75/150 మార్కులు కనీస అర్హత కాగా, ఆమె APTET–2018 Paper-II-A, Social Studiesలో 75 మార్కులు సాధించారని తెలిపారు. అందువల్ల ఆమె నిర్దేశిత TET అర్హతను సరిగ్గా సాధించినట్లు రికార్డుల ఆధారంగా నిర్ధారించబడిందని తెలిపారు. ఆమె Sports Quota కింద SA-Social Studies పోస్టుకు ఎంపికై విశాఖపట్నం జిల్లాలో నియమితులయ్యారన్నారు.

5. టెట్ అర్హత కలిగిన ఇతర అభ్యర్థులు
అదే విధంగా టెట్ అర్హత కలిగిన షేక్ నయాబ్ రసూల్, జక్కుల ఉదయలక్ష్మి, తాడిమర్రి మహమ్మద్ రఫీ, దేవరకొండ పవన్ కుమార్, తొగట చరణ్ రాజా తదితర అభ్యర్థుల విరాలను పరిశీలించగా సంబంధిత TET పేపర్లలో నిర్దేశిత మార్కులు సాధించినట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయన్నారు. వీరిలో షేక్ నయాబ్ రసూల్ (APTET Paper-I-A, 2022) 82.57, జక్కుల ఉదయలక్ష్మి (2024) 94.28, తాడిమర్రి మహమ్మద్ రఫీ (2022) 89.22, దేవరకొండ పవన్ కుమార్ (2017) 77, తొగట చరణ్ రాజా (2024) 106 మార్కులు సాధించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయని ఆమె తెలిపారు.

6. వి. చక్రపాణి రెడ్డి – చిత్తూరు
Ex-Servicemen కేటగిరీకి చెందిన వి. చక్రపాణి రెడ్డిపై కూడా TET అర్హత లేదనే ఆరోపణ వచ్చిందన్నారు. Ex-Servicemen అభ్యర్థులకు 40 శాతం, అంటే 60/150 మార్కులు కనీస అర్హత అని, ఆయన APTET–2024 Paper-II-A, Social Studiesలో 79.47 మార్కులు సాధించారన్నారు. అదనంగా CTET Paper-II-Aలో 65 మార్కులు సాధించడం జరిగిందన్నారు. అందువల్ల TET అర్హత విషయంలో వచ్చిన ఆరోపణ నిర్ధారణ కాలేదన్నారు. . అనంతరం ఆయన Sports Quota కింద SA-Social Studies పోస్టుకు ఎంపికై కుప్పం పరిధిలో నియమితులయ్యారు.

క్రీడా కోటా అభ్యర్థులపై ఆరోపణలకు సంబందించి SAAP వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి భరణి వివరణ ఇస్తూ…..

Sports Quotaకు సంబంధించి 08.08.2025 నుంచి 14.08.2025 వరకు Tentative Sports Quota Listను ప్రచురించి, grievance redressalకు అవకాశం కల్పించిందని ఆమె తెలిపారు. అనంతరం కూడా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించామన్నారు.

Sports DSCకు సంబంధించి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 69 Writ Petitions దాఖలైనప్పటికీ, అవి AP State Judo Association జారీ చేసిన Judo certificates నకిలీవి లేదా అసలైనవి కావనే అంశానికి సంబంధించినవి కావని ఆమె స్పష్టం చేశారు.

ప్రస్తుతం PIL No.170, dated 23.07.2026 ద్వారా AP Judo Association జారీ చేసిన సర్టిఫికెట్ల ప్రామాణికతపై అంశం గౌరవ హైకోర్టు పరిశీలనలో ఉందన్నారు. 2017 నుంచి విజిలెన్స్ శాఖకు ఫిర్యాదులు అందినట్లు PILలో పేర్కొనబడిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విజిలెన్స్ శాఖను విచారణ పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశించడం జరిగిందన్నారు. కాబట్టి ఈ అంశంపై తుది నిర్ణయం విచారణ ఫలితాల ఆధారంగానే ఉంటుందని ఆమె తెలిపారు.

Judo సర్టిఫికెట్లపై నిబంధనలు…
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రీడాకారుల నియామకాల్లో సంబంధిత క్రీడా విభాగానికి చెందిన అధికారిక సంస్థల ద్వారా జారీ చేసిన ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు.
National-level competitionsకు సంబంధిత National Federation లేదా State Association, Inter-University competitionsకు సంబంధిత విశ్వవిద్యాలయం, School Gamesకు సంబంధిత విద్యాశాఖ/క్రీడా అధికారి, Khelo India Gamesకు Sports Authority of Indiaలో నియమిత అధికారి ధ్రువీకరణలు జారీ చేసే అధికారం ఉందన్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం వచ్చిన సర్టిఫికెట్లను నియామక ప్రక్రియలో పరిశీలించడం జరిగిందన్నారు.

ఒకే మండలానికి చెందిన Judo క్రీడాకారులపై ఆరోపణ
21 మంది అభ్యర్థులు ఒకే క్రీడా విభాగమైన Judoకు చెందినవారని, ఒకే మండలానికి చెందినవారని, వారిలో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందినవారని ఆరోపణలు వచ్చాయన్నారు. సంబంధిత క్రీడా సర్టిఫికెట్ల ప్రామాణికతపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తై వాస్తవాలు నిర్ధారణ అయిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

అలాగే ఒక క్రీడాకారుడు తన స్వస్థల జిల్లాలోనే తప్పనిసరిగా పోటీ చేయాలనే నిబంధన లేదని ఆంధ్రప్రదేశ్ Judo Association తన లేఖలో స్పష్టం చేసిందన్నారు. క్రీడాకారుడు తాను ప్రస్తుతం చదువుతున్న లేదా పనిచేస్తున్న జిల్లాను కూడా ప్రాతినిధ్యం వహించవచ్చని Association పేర్కొందన్నారు.

నొస్సం కరిష్మా – షేక్ ఇమామ్ హుస్సేన్
భర్త, భార్య ఇద్దరూ Sports Quota కింద ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారని, వారి Judo సర్టిఫికెట్ల ప్రామాణికతపై సందేహాలున్నాయని ఆరోపణలు వచ్చాయన్నారు. ఇద్దరూ 11–13 నవంబర్ 2014లో విజయవాడలో జరిగిన Senior Inter-District Judo Tournamentలో రెండో స్థానం సాధించినట్లు రికార్డుల్లో ఉందన్నారు. ఇద్దరూ భార్యాభర్తలు అయినప్పటికీ, వారు పురుషులు, మహిళల వేర్వేరు విభాగాల్లో, వేర్వేరు బరువు కేటగిరీల్లో పోటీ చేసినందున వారి క్రీడా ప్రతిభను విడివిడిగా పరిగణించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే క్రీడా పోటీలో పాల్గొనడానికి తప్పనిసరిగా విద్యాసంస్థలో నమోదు అయి ఉండాలనే నిబంధన లేదని ఆమె తెలిపారు. 2014లో షేక్ ఇమామ్ హుస్సేన్ కర్ణాటకలో B.Ed చదువుతున్నప్పటికీ, తన నేటివిటీ ఆధారంగా కర్నూలు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆంధ్రప్రదేశ్ తరఫున పోటీ చేసినట్లు ఆమె వివరించారు.

పెద్ద అప్పలరాజు – Boxing సర్టిఫికెట్ వివాదం
పెద్ద అప్పలరాజు విషయంలో మొదట తప్పుగా తన సోదరుడి స్పోర్ట్స్ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసినట్లు ఆరోపణ వచ్చిందన్నారు. అయితే దరఖాస్తులలో తప్పులను సరిచేసుకునేందుకు చివరి దశలో అదనపు సమయం ఇవ్వబడిన సమయంలో, అభ్యర్థి తన National Championship certificateను backup certificateగా అప్‌లోడ్ చేయడం జరిగిందన్నారు. Physical Verification సమయంలో కూడా అదే సర్టిఫికెట్‌ను సమర్పించారన్నారు.

2023లో Goaలో జరిగిన 37వ National Games రికార్డుల్లో “PANDA”గా పేరు నమోదైన అంశంపై కూడా ఆమె స్పష్టత ఇచ్చారు. అసలు సర్టిఫికెట్‌లో అభ్యర్థి పేరు “PEDDA APPALA RAJU” గానే ఉందని ఆమె తెలిపారు.

కొనడ పద్మజ – Athletics సర్టిఫికెట్
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొనడ పద్మజ విషయంలో 2021లో AP Senior Inter-District Athletics Championshipsలో పాల్గొని రెండో స్థానం సాధించిన విషయంపై, ఆమె వయస్సు మరియు గత క్రీడా రికార్డులపై సందేహాలు వ్యక్తమయ్యాయన్నారు.

అయితే అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు, సంబంధిత Athletics Association సమర్పించిన authentication/Form-II ఆధారంగా ఆమె క్రీడా విజయాన్ని చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించినట్లు ఆమె తెలిపారు. G.O.Ms.No.4, dated 19.04.2025లోని వర్తించే నిబంధనల ప్రకారం ఆమెను పరిగణనలోకి తీసుకున్నట్లు వివరించారు.

Softball సర్టిఫికెట్లపై వివరణ
శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన Softball certificatesపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, ముఖ్యంగా Form-IIను సంబంధిత Association అధ్యక్షుడు జారీ చేయగలరా అనే అంశంపై సందేహాలు వచ్చాయన్నారు.

ఈ నేపథ్యంలో Softball Association of India SAAP వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌కు పంపిన లేఖలో, క్రీడాకారుల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో శ్రీ కూన రవి కుమార్‌కు Andhra Pradesh Softball Association తరఫున sports certificatesను verify చేయడానికి అధికారం ఇచ్చినట్లు ఆమె తెలిపారు. అలాగే Andhra Pradesh Softball Associationను 2026లో SAAP గుర్తించినట్లు కూడా ఆమె వివరించారు.

OC-EWS కేటగిరీపై వచ్చిన ఆరోపణలు
OC-EWS కేటగిరీపై ఆరోపణలు ఎదురైన అభ్యర్థుల విషయంలో, సంబంధిత సమర్థ అధికారి జారీ చేసిన EWS సర్టిఫికెట్ ఆధారంగా నియామకం జరిగినట్లు ఆమె తెలిపారు. ఇటువంటి సందర్భాల్లో నిర్ణయం వ్యక్తిగత ప్రకటనల ఆధారంగా కాకుండా సమర్థ అధికారి జారీ చేసిన అధికారిక ధ్రువీకరణ పత్రాల ఆధారంగా తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

నియామక ప్రక్రియలో పారదర్శకత, నిబంధనల అమలు, అధికారిక ఆధారాల పరిశీలనకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని, విచారణలో ఏదైనా అక్రమం నిర్ధారణ అయితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర విద్యా శాఖ కమిషనర్ శ్రీమతి తమీమ్ అన్సారియా మరియు SAAP వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి భరణి స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *