-విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం
-ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి విద్య, వైద్య రంగాల బలోపేతంగా లక్ష్యంగా పశ్చిమ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టారని ఏపీ నూర్ భాషా దూదేకుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అన్నారు.
“సుజనా ఫౌండేషన్” క్రిస్ప్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “విజయ దీపం” రెండేళ్ల వేడుకలు మరియు టీచర్స్ డే వేడుకలు చిట్టినగర్ లో మంగళవారం ఘనంగా నిర్వహించారు
శ్రీ నగరాల సీతారామస్వామి కళ్యాణ మండపం లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపి నూర్ భాషా దూదేకుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, సుజనా ఫౌండేషన్ సీ ఈ ఓ సుధా ఉపాధ్యాయుల , క్రిస్ప్ ఆర్గనైజేషన్ సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ “సుజనా ఫౌండేషన్” ఆధ్వర్యంలో క్రిస్ప్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో గత రెండేళ్లలో విజయ దీపం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే సుజనా చౌదరి అంగన్వాడి కార్యకర్తలకు శిక్షణనిచ్చి ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ పై అవగాహన కల్పించడం తో పాటు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు..
మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ సుజనా ఫౌండేషన్ ద్వారా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు , గర్భిణీలకు 2డి ఎకో పరీక్షలు, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు.
ఎమ్మెల్యే సుజనా ప్రజల మన్ననలు పొందిన నాయకుడని ప్రజా సమస్యలను పరిష్కారానికి పటిష్టమైన కార్యాలయ వ్యవస్థను రూపొందించారని తెలిపారు.
47 వేల అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందిస్తూ పశ్చిమాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న సేవకుడు సుజనా అని నాగుల్ మీరా కొనియాడారు..
ఈ కార్యక్రమంలో ఐ సి డీ ఎస్ సూపర్ వైజర్ ప్రశాంతి , జహీదా, క్రిస్ప్ ఆర్గనైజేషన్ టీం లీడర్
వీ మృదుల, స్టేట్ లీడర్ భవ్య, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ కీర్తి, యశస్విని, తేజస్వి, ప్రత్యూష, వైష్ణవి ,
చల్లంరాజు వెంకట శేషయ్య ఎండోమెంట్ ట్రస్ట్ చైర్మన్ ముదిగొండ శివ, 48 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు బెవర జోగేశ్వరరావు, పేరా భక్తుల రమణ, ఖాజా, దీటి ప్రభుదాస్, పైలా నరసింహారావు, గుడేల మహేష్ , సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News