Breaking News

సేవే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చిన BJP జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం MLA సుజనా చౌదరి కార్యాలయంలో BJP NTR జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ, రాబోయే కొద్ది రోజుల్లో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని, కేంద్రంలో నూ రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉంటే వచ్చే అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు, మూడు పార్టీల నాయకుల సమన్వయ సహకారంతో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించాలని పిలుపునిచ్చారు, అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకూ “సేవా సంకల్ప్ అభియాన్” పేరుతో జాతీయ & రాష్ట్ర పార్టీలు ఇచ్చిన సేవా కార్యక్రమాలు, మోదీ జన్మదిన కార్యక్రమాలను చేస్తూ ప్రజలకు చేరువ అయ్యేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు, NTR జిల్లా అభివృద్ధిలో సింహభాగం సహకారం అందిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి NTR జిల్లా భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు, ఈ కార్యవర్గ సమావేశములో రాష్ట్ర కార్యాలయ ఇంచార్జ్ & హైకోర్ట్ బార్ కౌన్సిల్ సభ్యులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు, ప్రోగ్రాం కన్వీనర్ పాతూరి నాగభూషణం, అధికార ప్రతినిధులు సాదినేని యామినీ ,రవీంద్ర రెడ్డి, అదిశేషు, రాష్ట్ర మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ భాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు MV సుబ్బయ్య , పోతంశెట్టి నాగేశ్వర రావు, లాకా వెంగళ్ రావు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కోలపల్లి గణేష్, పిట్టల గోవింద తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *