విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని “సుజనా ఫౌండేషన్ ” ఉచిత ఆరోగ్య శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. ఆర్థిక ఇబ్బందులు , కుటుంబ బాధ్యతల నడుమ మహిళలు తమ ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని అధిగమించడానికి వారిలో హెల్త్ అవేర్నెస్ పెంచడానికి “సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. మంగళవారం చిట్టినగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వరుసగా ఐదో మంగళవారం గర్భిణీల కోసం మరియు అంగన్వాడి కార్యకర్తల కోసం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
గర్భిణీలకు ఉచిత మొబైల్ 2 డి ఎకో హెల్త్ స్క్రీనింగ్ లను నిర్వహిస్తూ శిశువు పెరుగుదలను పర్యవేక్షిస్తూ తల్లి ఆరోగ్యాన్ని అంచనా వేస్తూ ముందస్తు ప్రాణాంతక సమస్యలను నివారిస్తున్నారు. మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో 20 మంది గర్భిణీలకు 2 డి ఎకో మాటర్నల్ కార్డియాక్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు మరియు 47 మంది అంగన్వాడి కార్యకర్తలకు జనరల్ ఫిజీషియన్స్ వైద్య సేవలందించారు. డాక్టర్ పీ మౌనిక , 2డి ఎకో టెక్నీషియన్ భాను ,వైద్య సేవలు అందించి గర్భిణీలు ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు ఈ వైద్య శిబిరంలో తమ సేవలందించారు..
Prajavartha Online Telugu News