Breaking News

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. ఓ. సి ) లను జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యే , ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి భవానిపురం, ఎన్డీయే కార్యాలయంలో బాధితులకు ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు.

56 వ డివిజన్, రాజ రాజేశ్వరి పేటకు చెందిన షేక్ రబియా బస్రీ(48) వెన్నెముక వ్యాధితో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 7 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. 45వ డివిజన్ సితార సెంటర్ కు చెందిన బైరం షబానా(38) ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 4 లక్షల 70 వేల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, కూటమి నేతలు కందుల సుబ్రమణ్యేశ్వరరావు,బొమ్ము రాంబాబు, బొమ్ము గోవిందమ్మ,
పచ్చి పులుసు వెంకట శివప్రసాద్, బెన్నా భక్తుల సోమేశ్వరరావు,పగడాల కృష్ణా, పైలా సురేష్, పిట్టల గోవిందు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *