-15వ తేదీ వరకు గడువు పెంచిన ప్రభుత్వం
-మైనారిటీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి
-మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్-2026ను అనుసరించి గ్రూప్-I పరీక్షలకు పోటీపడే మైనారిటీ అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష కు దరఖాస్తు గడువును పెంచినట్లు మైనారిటీ, న్యాయశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సిఈడిఎం ) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందేనని మంత్రి గుర్తు చేశారు.అర్హులైన మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్-1 సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు మొదట ఈనెల 10వ తేదీ వరకు గడువు నిర్దేశించడం జరిగిందన్నారు.దరఖాస్తు సమర్పణ గడువును 15 వ తేదీ వరకు పొడిగించామని మంత్రి తెలిపారు.ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులైన మైనారిటీ అభ్యర్థులు ఈ అదనపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పొడిగించిన గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 సివిల్ పరీక్షకు హాజరుకావాలనుకునే మైనారిటీ అభ్యర్థులకు శ్రేష్ఠమైన శిక్షణ, మార్గదర్శకత్వం, సహకారాన్ని అందించడమే ఉచిత శిక్షణా కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు.మరిన్ని వివరాల కోసం సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సిఈడిఎం),మైనారిటీ సంక్షేమ శాఖ,వెబ్‌సైట్: https://apcedmmwd.org ఫోన్: 08645-297535 / 7386789966. సంప్రదించాలని మంత్రి ఎన్ఎండి ఫరూక్ కోరారు.
Prajavartha Online Telugu News