గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు పీఎం స్వానిధి లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీధి వ్యాపారులు పీఎం స్వానిధి పథకం ద్వారా పొందే రుణాలు, పధకాలు వాటి ప్రయోజనాలు, డిజిటల్ లావాదేవీలు. క్రెడిట్ కార్డు , ఆయుష్మాన్ భారత్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి స్టేట్ మిషన్ మేనేజర్ (SMM) శ్రీమతి ప్రభావతి గారు, గుంటూరు TE – LH శ్రీ N. జయకుమార్ గారు, TE-బ్యాంకు లింకేజ్ శ్రీ J.రవికాంత్ గారు, సిటీ మిషన్ మేనేజర్ లు, టౌన్ వెండింగ్ కమిటి ప్రెసిడెంట్ శ్రీ నరసింహ గారు మాట్లాడారు. వీధి వ్యాపారులు పీఎం స్వానిధి పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఓలు, టీఎల్ఎఫ్ లీడర్లు, రిసోర్స్ పర్సన్ లతో పాటు పలువురు వీధి వ్యాపారులు పాల్గొన్నారు. వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధికి పీఎం స్వానిధి పథకం ఎంతో ఉపయోగకరమని, అర్హులైన ప్రతి వీధి వ్యాపారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
Prajavartha Online Telugu News