Breaking News

14వ తేదీన ఏపి గెజిట్ ఫారం- VI లో తుది నోటిఫికేషన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఈ నెల 11వ తేదీకి రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి 39 అభ్యంతరాలు, వినతులు, సూచనలు అందాయని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నుంచి 25, జనసేన పార్టీ నుంచి 9, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి 2, భారతీయ జనతా పార్టీ నుండి 2, ఒక వ్యక్తిగత పరిధి నుంచి 1 వినతి పత్రం అందాయని తెలిపారు.
ప్రజల నుంచి వచ్చే అందిన సూచనలు, అభ్యంతరాలను ప్రభుత్వ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12 సిడిఎంఏకి పంపుతామని, సిడిఎంఏ 13వ తేదీన తుది వార్డ్ లను ఖరారు చేసి, 14వ తేదీన ఏపి గెజిట్ ఫారం- VI లో తుది నోటిఫికేషన్ ప్రచురిస్తారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *