విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల సంఖ్యను 64 నుంచి 86కు పెంచే ప్రతిపాదనపై ప్రజల నుంచి మొత్తం 14 అభ్యంతరాలు అందినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు .
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి, ఈ ప్రాథమిక నోటిఫికేషన్‌పై ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని . ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, సంబంధిత వర్గాల నుంచి మొత్తం 14 అభ్యంతరాలు నగరపాలక సంస్థకు అందాయని అన్నారు.
Prajavartha Online Telugu News