– ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టి
– అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యకు పరిష్కారం
– జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, శాసనసభ్యులు తంగిరాల సౌమ్య
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి 136 అర్జీలను స్వీకరించడం జరిగిందని.. ప్రతి అర్జీపైనా ప్రత్యేక దృష్టిపెట్టి నాణ్యతతో అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, స్థానిక శాసనసభ్యులు తంగిరాల సౌమ్య అన్నారు.
ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా నందిగామ నియోజకవర్గ స్థాయిలో శుక్రవారం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. నందిగామ-మధిరరోడ్డులోని ఆర్.ఎస్.గార్డెన్స్ నందు జరిగిన ఈ ప్రత్యేక గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య.. అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 136 అర్జీలు అందగా వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 69, పంచాయతీరాజ్‌కు 19, స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డుకు 15, పట్టణ పరిపాలనకు 9, విద్యుత్‌కు 5, సర్వేకు 4, రహదారులు-భవనాల శాఖకు 4, విద్యా శాఖకు 3 అర్జీలు వచ్చాయి. అదేవిధంగా వైద్య ఆరోగ్యం శాఖకు 2, గృహ నిర్మాణం శాఖకు 2, పోలీసు, డ్వామా, రిజిస్ట్రేషన్, కాలుష్య నియంత్రణ శాఖలకు ఒక్కో అర్జీ వచ్చాయి. ఈ అర్జీలను క్షుణ్నంగా పరిశీలించి నాణ్యతతో అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని జేసీ ఇలక్కియ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజల చెంతకే అధికారులు వచ్చి వారి సమస్యలను తెలుసుకొని వీలైనంత త్వరగా పరిష్కరించే లక్ష్యంతో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నందిగామ ఆర్‌డీవో అనిల్ కుమార్, పీజీఆర్ఎస్ జిల్లా నోడల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News