-దళారులకు పండగ, సామాన్యునికి దండగగా మారిన కూటమి పాలన !
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే, సామాన్యుడు మాత్రం పండగ పూట కూడా పస్తులుండే పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వ పాలనలో దాపురించాయని సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేసారు.ఈ రోజు స్థానిక విద్యాధరపురం సితార సెంటర్లో సిపిఐ స్థానిక డివిజన్ల ఆధ్వర్యంలో నగర కార్యదర్శివర్గ సభ్యురాలు పంచదార్ల దుర్గాంబ అధ్యక్షతన వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిత్యావసరాల ధరలు అమాంతంగా రెండు నుండి మూడు రేట్లు పెరగడం జరిగింది అని అందుకు తగిన విధంగా సామాన్య ప్రజల ఆదాయం పెరగక పోవడంతో పేద, మధ్యతరగతి రానున్న పండగ రోజులని కూడా దండగ రోజులుగా భావిస్తు ప్రజలు ఆకలిని,ఆశలను చంపుకొని బతకాల్సిన పరిస్థితులు నెలకోన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు.రాష్ట్రంలో కూటమి నాయకులు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యవసరాల ధరలు తగ్గించి పేదవానికి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ధరల తగ్గించడం పక్కకు పెట్టి గతంలో అంటే 2024 నాటికీ ఉన్న ధరలను అమాంతం పైకి ఎగబాయించి సమస్య ప్రజలకు కనీసం ఆకలి తీర్చుకునే అవకాశం కూడా లేకుండా చేసే విధంగా ధరల పెరుగుతున్నప్పటికీ కూటమికి ప్రభుత్వం ధరల నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని.మరో పక్క రాష్ట్రంలో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేక ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు మరి పెరిగిన ఈ ధరల వ్యత్యాసం ఎవరి జేబుల లోకి చేరుతుందని ప్రశించారు. గిట్టుబాటు ధరల కల్పనకు పటిష్ట చర్యలు చేపట్టకుండా, దళారీ, బ్లాక్ మార్కెట్ వ్యవస్థకు కొమ్ముకాస్తూ పెట్టుబడి దారులకు సంపద సృష్టే ప్రధాన ఏజెండగా పాలనా సాగిస్తుందని ఎద్దేవా చేసారు.మరి ఈ అధిక ధరలను అందుకునే స్థాయిలో సామాన్యుని ఆదాయం పెరిగిందా అని ప్రభుత్వాన్ని ప్రశించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా నిత్యవసరాలైన బియ్యంతో పాటు,చక్కర,వంటనూనె, పప్పులు వంటి 14 రకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అదేవిధంగా ధరల స్థిరీకరణకు,బ్లాక్ మార్కెట్ నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
నగర సహాయ కార్యదర్సులు లంక దుర్గారావు,నక్క వీరభద్రరావులు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో ప్రజల ఆహార అవసరాలు తీర్చే బియ్యం ధర కేవలం రెండు నెలల వ్యవధిలో బస్తాకు 500 రూపాయలు పెరగడం,వంట నూనె,చక్కెర, ఉల్లిపాయలు, పప్పులు ఇలా ఏది కొనాలన్న సామాన్యుడు భయపడే పరిస్థితి నెలకొన్నదని, పెరుగుతున్న నిత్యవసరాల కొరత ఆసరాగా చేసుకొని దళారులు నిత్యవసరాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ ప్రజల అవసరాలను వారి ఆదాయవనరులుగా మారుస్తుంటే పాలకులు బ్లాక్ మార్కెట్ దళారులకు,పెట్టుబడి దారులకు సంపద సృష్టిస్తూ సామాన్యునికి వెన్నుపోటు పొడుస్తోందని, మరో పక్క కేంద్ర ప్రభుత్వం యుద్ధాల పేరుతో పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను రికార్డు స్థాయికి పెంచి వారి రికార్డులను వారే అధికమించే దిశగా పాలనా సాగించడంతో ధరల పెరుగుదలకు ఈ రోజు రవాణా వ్యయం పెరగటం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు అని అన్నారు. ప్రజలకు నిత్యవసరాలను అందుబాటులోకి తెచ్చేందుకు తక్షణం చర్య క్రింద చౌకధరల దుకాణాల ద్వారా 14 రకాల నిత్యవసరాలను అందిచాలని లేని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు అనే ఆయుధం ద్వారా పాలక ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. నగర కార్యవర్గ సభ్యులు బుద్దే రాజా కార్యక్రమానికి వందన సమర్పణ చేసి నిరసన కార్యక్రమాన్ని ముగించారు
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు తాడి పైడియ్య, కొట్టు రమణారావు, డివిజన్ కార్యదర్శులు ఉప్పలపాటి శివ ప్రసాద్ రాజు, టి. పూర్ణయ్య, డివిజన్ నాయకులు అంజూరి సూరిబాబు, ఎ.వి.రంగారావు, నడికుదిటి వెంకటేశ్వరరావు, దోమతోటి రాంబాబు, కోటా రాంబాబు, భగవాన్, నక్కా నాగేశ్వరరావు,దాసరి రంగారావు,పి.అప్పారావు , ఎఐవైఎఫ్ నగర అధ్యకులు కంచర్ల భార్గవ్, నాయకులు లంకే సాయి,పి.విశాల్,అభి, టి.అవినాష్,మహిళా సమాఖ్య నాయకులు అండిమాని నాగమణి,పడాల తవుడమ్మ, అప్పికొండ లక్ష్మీ,మురళి సాయి మణి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News