Breaking News

కనకదుర్గమ్మ సన్నిధికి ప్రముఖులకు ఆహ్వానం

–విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ హంగులు
-తమిళనాడు సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, ప్రహ్లాద్‌ జోషీలకు ఆహ్వానం

ఢిల్లీ / చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఘనంగా నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ ఉత్సవ్‌ ప్రతినిధి బృందం తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ను కలిసి ఆహ్వానించింది. విజయవాడకు విచ్చేసి శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకోవడంతో పాటు నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వారసత్వ వైభవాన్ని ఆస్వాదించాలని కోరింది.

ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జీఎం హరీష్‌ బాలయోగితో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) తమిళనాడు సీఎంను కలిశారు. విజయవాడ ఉత్సవ్‌–2.0లో పాల్గొనాలని ఆయనను ఆహ్వానించారు.

కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్‌, ప్రహ్లాద్‌ జోషీలకు సైతం ఉత్సవాల ఆహ్వాన పత్రికలను అందజేశారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, ఎంపీలు కేశినేని శివనాథ్‌, జీఎం హరీష్‌ బాలయోగి, విజయవాడ ఉత్సవ్‌ కమిటీ ప్రతినిధి నరసింహారావు కేంద్ర మంత్రులను కలిసి ఆహ్వానించారు.

విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్‌–2.0 ద్వారా నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళా, చారిత్రక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. వివిధ రాష్ట్రాల ప్రముఖులు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఉత్సవానికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.

కనకదుర్గమ్మ ఆశీస్సులు పొందేందుకు, విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించేందుకు ప్రముఖులు ఉత్సవాలకు హాజరవుతారని ఆశిస్తున్నట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలకు నాందిగా.. నగరంలో ‘స్పేస్ వాక్’

-విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరంలో ఈ నెల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *