Breaking News

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం..

-12,358 మంది అభ్యర్థులకు గాను పేపర్-1కు 6,378
-12,358 మంది అభ్యర్థులకు గాను పేపర్-2కు 6,320 మంది హాజరు..
-58 మంది విభిన్న ప్రతిభావంతులకు గాను 25 మంది హాజరు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
29 కేంద్రాల ద్వారా పరీక్షల నిర్వహణ… విధులు నిర్వర్తించిన 1,332 మంది ఇన్విజిలేటర్లు, 29 మంది వెన్యూ సూరర్వైజర్లు, 85 మంది అసిస్టెంట్ వెన్యూ నూపర్వైజర్లు, లైజనింగ్ ఆఫీసర్స్ 29 మంది. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ.

జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. నగరంలోని సిద్ధార్థ మహిళ కళాశాల, బిషప్ అజయర్య జానియర్ కళాశాల, పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల, కె.బి.ఎన్.కళాశాల పరీక్షా కేంద్రాలను ఆదివారం కలెక్టర్ యస్ డిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12,358 మంది అభ్యర్థులకు గాను పేపర్-1కు 6,378, 12,358 మంది అభ్యర్థులకు గాను పేపర్-2కు 6,320 మంది హాజరు, 58 మంది విభిన్న ప్రతిభావంతులకు గాను 25 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 29 పరీక్షా కేంద్రాలలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామని, పడమట కెబిసి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో 29 మంది విభిన్న ప్రతిభావంతులు పరీక్ష వ్రాసారని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్ష నిర్వహణను పర్యవేక్షించామన్నారు. పరీక్షలకు నియమించిన 1,332 మంది ఇన్విజిలేటర్లు, 29 మంది వెన్యూ సూపర్వైజర్లు, 85 మంది అసిస్టెంట్ సూపర్వైజర్లు సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించారన్నారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సక్రమంగా ప్రశాంతంగా ప్రిలిమినరీ పరీక్షననఱు నిర్వహించిన అధికారులను, సిబ్బందిని కలెక్టర్ ఢిల్లీరావు అభినందనలు తెలిపారు. పరీక్షల ఓవరాల్ ఇన్స్పెక్టింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, కస్టోడియన్ అధికారిగా వ్వవహరించిన డిఆర్వో కె. మోహన్ కుమార్, పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా డిప్యూటి తహశీల్దార్ మధుబాబు పర్యవేక్షించారు.

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్:
నగరంలోని సిద్ధార్థ మహిళా కళాశాల, నలంద విద్యానికేతన్, ఎన్.ఎస్.ఎమ్.స్కూల్, పడమట కె.బి.సి.జెడ్పీ హైస్కూల్లోని పరీక్ష కేంద్రాలను జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ పరిశీలించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *