Breaking News

గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  పేద మహిళలకు తోపుడు బండ్లు పంపిణీ, అన్నదానం


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నెహ్రూ బొమ్మ సెంటర్ కొత్తపేటలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి గుడి ఆవరణలో బుధవారం రవి కృష్ణ మాతృమూర్తి కీl l శే l l గొలగాని లక్ష్మీ దుర్గాంబ  82వ జయంతి సందర్భంగా ప్రవాసాంధ్రులు గొలగాని రవి కృష్ణ ఆధ్వర్యంలో గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి తల్లిదండ్రుల పేరు మీద పశ్చిమ నియోజకవర్గం లోని వెనకబడిన వర్గాలకు చెందిన పేద మహిళలకు జీవనోపాధి నిమిత్తం ఉచితంగా తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్య్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు తెలుగుదేశం పార్టీ 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ గొలగాని రవి కృష్ణ ఎక్కడో విదేశాల్లో ఉండి విజయవాడలోని అనేక సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకమని అన్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ గొలగాని రవి కృష్ణ తన తల్లి దండ్రుల పేరు మీద వారి తల్లి జయంతి సందర్భంగా పేదవారికి రెండు తోపుడు బళ్లను ఇవ్వటమే కాకుండా 200 మందికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించరన్నారు. రవికృష్ణ కరోనా కష్టకాలంలో కూడా ఎంతో సేవలందించరన్నారు. ప్రైవేటు స్కూలులో పనిచేసే ఉపాధ్యాయులకు, సినిమా థియేటర్లో పనిచేసే సినీ కార్మికులకు అలాగే శానిటరీ, పోలీస్ సిబ్బందికి ఎంతోమందికి నిత్యావసర సరుకులు తో పాటు కూరగాయలు బట్టలు పంపిణీ చేయడం చాలా ఆనందదాయకం అన్నారు. ఇలాంటి మంచి మనసున వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అని, ఇలాంటి వారు రావడం వలన పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తారన్నారు. పల్లా దుర్గమ్మ సీపీఐ మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ రవి కృష్ణ తన తన తల్లిదండ్రుల పేర్లను నిలబెట్టిన గొప్ప మనసున్న మనిషి అని అతను సేవా కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నాడని ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 10 తోపుడు బండ్లు పలువురు పేద బడుగు బలహీన వర్గాలకు వారి జీవనోపాధి నిమిత్తం అందజేయడం జరిగిందన్నారు. అతనికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు భోగావల్లి శ్రీధర్ మాట్లాడుతూ గొలగాని రవి కృష్ణ అనేక సేవా కార్యక్రమాలు కరోనాలోనే కాకుండా ఎంతో మందికి ఆర్థికంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారికి ఆర్థిక సాయం అందించడంలో ముందున్న వ్యక్తి అన్నారు. ఈ కార్య్రమంలో పొట్నూరి చక్రధర్, దుక్కా వేణు, బిసి సంఘం నాయకులు నమ్మి అప్పారావు, నమ్మి భాను, యాదవ కళ్యాణ మండపం సెక్రటరీ మురిపాల దుర్గారావు, దేవర సురేష్, బొట్ట నాగేంద్ర, బొట్ట అర్జున్, ఆవాల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *