విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ 55వ డివిజన్ అధ్యక్షులు సోమి. గోవింద్ కమిటీసభ్యులు, పార్టీ నాయకుల తో కలిసి ఎర్ర కట్ట ను పరిశీలించిటం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి బాగా చేసామని కొంత మంది వైసిపి నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని, వారు చేపే అబద్ధపు ప్రచారాన్ని ప్రజల ఎవరు కూడా నమ్మడం లేదని, మేము ఈరోజు ఎరకట్ట రోడ్డు యొక్క వాస్తవ పరిస్థితుల్ని చూపించడానికి ఎర్రకట్ట రోడ్డు పరిసర ప్రాంతాల్లో పర్యటించడం జరిగిందని , ఎర్రకట్ట రోడ్డుకి మరమ్మత్తులు చేయాలని తద్వారా ఈ ప్రాంత వాసులకు రాకపోకలు సునాయాసం చేయాలని, ఈ ప్రాంత వాసులకి బస్సు, ఆటో సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదని, నైజాం గేట్ పంజా సెంటర్ వద్దనుండి చిట్టినగర్ వెళ్లాలన్న మీసాల రాజేశ్వరరావు బ్రిడ్జి వైపుకు వెళ్లాలన్న చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని, కాబట్టి ఎర్రకట్ట రోడ్డుని యుద్ధ ప్రాతిపదిక మరమ్మతులు చేపట్టాలని, మేము అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రైల్వే శాఖ అధికారులతో మాట్లాడటం జరిగిందని, కానీ స్థానిక ప్రజాప్రతినిధులు గాని స్థానిక ఎమ్మెల్యే గాని ఎవరూ కూడా ఈ సమస్య మీద స్పందించడం లేదని, మేము గతంలో ఇక్కడ ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి కూడా వీలు లేకుండా గడ్డర్లు పెడితే మేము DRM తో మాట్లాడి పోరాటం చేసి ద్విచక్ర వాహనాలు రాకపోకలు వెళ్లే విధంగా పోరాటం చేశామని, వెల్లంపల్లి శ్రీనివాసరావు దశ బాగోలేదని ఆయన దేవదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో అనేక అల్లర్లు జరిగాయని దేవాలయాల మీద దాడులు జరిగాయని విగ్రహాలు ధ్వంసం చేయబడినవి రధాలు తగిలిబడ్డాయని అందుకనే వెల్లంపల్లి శ్రీనివాసరావు ని దేవదాయ శాఖ మంత్రి నుంచి తొలగించి మాజీ మంత్రి చేశారని, ఈ మధ్యకాలంలో రైల్వేలో అనేక ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోయారని, అట్లాంటి పరిస్థితి ఇక్కడ రాకూడదని, ఎర్రకట్ట పరిసర ప్రాంత ప్రజలుకు ఎటువంటి ప్రమాదాలకు గురి కాకూడదని ఎరకట్ట రోడ్డు మరమ్మతులు చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నామని, దీని మీద స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇప్పటికైనా కళ్లు తెరిచి కనీసం మాతో పాటు వచ్చి రైల్వే అధికారులకు ఒక వినతిపత్రం ఇస్తే ఎర్రకట్ట పనులు వేగవంతం అవుతాయని, మేము డిఆర్ఎం అపాయింట్మెంట్ తీసుకుని ఏర్రకట్ట రోడ్డు యొక్క పనులు వేగవంతంగా చేయాలని కోరతానని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సోమి. గోవింద్, పల్లంటి ఆది,సోమి మహేష్, గారే మురళి, అడూరి తమ్మరావు, కొరగంజి వెంకటరమణ, పొట్నూరి శ్రీనివాసరావు, ఏలూరి సాయి శరత్, , పులి చేరి రమేష్, బంటుమిల్లి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News