Breaking News

ప్రజల ముంగిట ప్రభుత్వ సేవలు అందించేందుకే జగనన్న సురక్ష – మంత్రి జోగి

గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గురువారం గూడూరు మండలం కప్పలదొడ్డి, పోసినవారి పాలెం గ్రామాల్లో జగనన్న సురక్ష కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు ఆదాయ కుల ధ్రువీకరణ పత్రాలు, రైస్ కార్డులు అందజేశారు. ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను సత్కరించారు. కప్పలదొడ్డి గ్రామంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన ఆరోగ్య సంరక్షణ మరియు వికాస కేంద్రం ప్రారంభించగా, 17 లక్షలతో నిర్మించిన నాలుగు సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వాలంటీర్లను సచివాలయ సిబ్బందిని ఇంటింటికి పంపించి మీకు ఏం కావాలో అడిగి తెలుసుకుని, మీరు ఏ అధికారుల చుట్టూ తిరగకుండా ఒకే చోట సచివాలయం వద్ద ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రైస్ కార్డులు, ఆదాయ, కుల, వివాహ 11 రకాలైన ధ్రువపత్రాలు అందించడానికి జగనన్న సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గురించి మంత్రి తెలియజేస్తూ కప్పలదొడ్డి గ్రామంలో 506 మంది నేతన్నలకు ఐదో విడత నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి 24 వేల చొప్పున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలో బటన్ నొక్కి మీ ఖాతాల్లో జమ చేయనున్నారని తెలిపారు. గ్రామంలో 584 మంది అవ్వా తాతలకు వైయస్సార్ భరోసా పెన్షన్లు, 61 మంది లబ్ధిదారులకు కాపు నేస్తం, 258 మంది లబ్ధిదారులకు వైయస్సార్ చేయూత 250 మంది లబ్ధిదారులు అమ్మబడి పథకాల కింద లబ్ధి చేకూర్చినట్లు మంత్రి వివరించారు. నాడు నేడు క్రింద పాఠశాల అభివృద్ధి పరిచి ఫీజు రియంబర్స్మెంట్ అందించడం ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు వివిధ పథకాల కింద మధ్య దళారీల ప్రమేయం లేకుండా, అవినీతికి తావు లేకుండా , ముఖ్యమంత్రి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జరుగుచున్నదని అన్నారు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగనన్నను మరువద్దని సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు.

ఈ కార్యక్రమాలలో గూడూరు ఎంపీపీ సంఘ మధుసూదనరావు, జడ్పిటిసి వేముల సురేష్ రంగబాబు, పెడన ఏఎంసీ చైర్ పర్సన్ చారుమతి రామానాయుడు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ తలుపుల వెంకట కృష్ణ, ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు, పిఎసిఎస్ అధ్యక్షులు జంపన ఫకీరు, ఎంపీటీసీ పేరిశెట్టి తేజోవతి, కప్పలదొడ్డి సర్పంచ్ యక్కల మాధవి నాగరాజు, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు పర్ణo మహా లక్ష్మయ్య, తాసిల్దారు విజయ ప్రసాద్, ఎండిఓ డి సుబ్బారావు, పలువురు పార్టీ నాయకులు, స్థానిక నాయకులు మండల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *